రానా.. చిన్న సినిమాతో రిస్క్ లేకుండా..

ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్స్ లో మంచి ఆదరణ లభిస్తోంది.

Update: 2024-09-04 10:32 GMT

ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్స్ లో మంచి ఆదరణ లభిస్తోంది. ఆగష్టు నెలలో చిన్న చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమాలు ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ తో ఉండటంతోనే మంచి కలెక్షన్స్ ను అందుకున్నాయి. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొస్తున్న మూవీ “35 చిన్న కథ కాదు”.

నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, భాగ్యరాజా, గౌతమి కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కింది. నంద కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సెలబ్రెటీ ప్రముఖులకి ఈ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు. వారి నుంచి కూడా మూవీకి సపోర్ట్ దొరుకుతోంది.

సెప్టెంబర్ 6న థియేటర్స్ లోకి రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి రానా 6.5 కోట్ల పెట్టుబడి పెట్టారంట. డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ కి 7.5 కోట్లకి ఇప్పటికే అమ్మేశారంట. అంటే రానా ఈ సినిమాతో ఇప్పటికే ప్రాఫిట్ లో ఉన్నారు. శాటిలైట్ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకి వెళ్లే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. అంటే టేబుల్ ప్రాఫిట్ తో “35 చిన్న కథ కాదు” సినిమాని రానా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.

మూవీ రిలీజ్ తర్వాత సెలబ్రెటీల నుంచి వరుస ట్వీట్ లు వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చిత్రం కావడంతో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ఉండబోతోంది. ఏ మాత్రం పాజిటివ్ మౌత్ టాక్ వచ్చిన కూడా సినిమాకి లాభాలు రావడం గ్యారెంటీ అని భావిస్తున్నారు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్న కూడా రానాకి అయితే పెద్దగా రిస్క్ లేదు.

కానీ మంచి కంటెంట్ ని ప్రేక్షకులకి బలంగా రీచ్ అయ్యేలా చేయాలని "35 చిన్న కథ కాదు చిత్రాన్ని రానా దగ్గుబాటి దగ్గరుండి గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. విజయ్ “GOAT” సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు ఈ మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. మరి నివేదా థామస్ పెర్ఫార్మెన్స్, ఈ మూవీ కథాంశం ప్రేక్షకులని ఏ మేరకు ఎంగేజ్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News