బిగ్‌ బాస్ మాదిరిగా నా పాపను చూస్తూనే ఉంటా..!

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సూపర్ స్టార్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సౌత్ లో ఆయనకు పెద్దగా పాపులారిటీ, ఫాలోయింగ్ లేదు.

Update: 2023-11-27 07:03 GMT

బాలీవుడ్ లో రణబీర్ కపూర్ సూపర్ స్టార్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సౌత్ లో ఆయనకు పెద్దగా పాపులారిటీ, ఫాలోయింగ్ లేదు. ఆయన గతంలో తన సినిమాలను సౌత్ లో పెద్ద ఎత్తున ప్రమోట్ చేసింది కూడా లేదు. బ్రహ్మాస్త్ర సినిమా కోసం సౌత్‌ ప్రచారం చేసినా కూడా ఇప్పుడు యానిమల్ సినిమా కోసం చేస్తున్నంత ప్రచారం మాత్రం చేయలేదు

యానిమల్ సినిమాకి సౌత్ దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వం వహించడంతో పాటు, సౌత్‌ స్టార్‌ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించడం వల్ల ఇక్కడ భారీ గా క్రేజ్ ఏర్పడింది. అందుకే యానిమల్‌ యూనిట్‌ సభ్యులు సౌత్‌ లోని ముఖ్య నగరాల్లో తీవ్రంగా ప్రచారం చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా బెంగళూరు లో మీడియాతో, ప్రేక్షకులతో యూనిట్ సభ్యులు చిట్ చాట్ చేశారు.

యానిమల్‌ టీమ్‌ బెంగళూరులో ప్రమోషన్‌ లో ఉండగా ఒక చిన్న పాప రణబీర్ కపూర్ తో మీరు షూటింగ్స్‌, ప్రమోషన్స్‌ అంటూ ట్రావెల్‌ చేస్తూ ఉంటారు కదా... ఆ సమయంలో మీ పాపను మిస్ అవుతారా అన్నట్లుగా ప్రశ్నించింది. ఆ పాప క్యూట్‌ ప్రశ్నకు రణబీర్ కపూర్ అంతే క్యూట్‌ గా ఆన్సర్ ఇచ్చాడు.

రణబీర్‌ స్పందిస్తూ.. నేను బయట ఉన్న సమయంలో నా పాపను కచ్చితంగా మిస్ అవుతాను. అయితే బిగ్‌ బాస్‌ లో ఎలా అయితే కెమెరాలతో చూస్తారో అలాగే నేను నా పాపని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటాను. నా భార్య ను పదే పదే పాప ను చూపించమని అడుగుతూ ఉంటాను అంటూ రణబీర్ చెప్పుకొచ్చాడు.

ఆలియా, రణబీర్ కపూర్‌ లకు గత ఏడాది నవంబర్‌ లో పాప జన్మించిన విషయం తెల్సిందే. ఆ పాప కు రహ కపూర్‌ అంటూ పేరు పెట్టారు. పాప కు అయిదు నెలలు వచ్చిన వెంటనే ఆలియా కూడా షూటింగ్స్ తో బిజీ అయింది. ఇక రణబీర్‌ కపూర్‌ కూడా ఎప్పుడు షూట్స్ తో బిజీగా ఉంటున్నాడు. అందుకు యానిమల్‌ తర్వాత కాస్త బ్రేక్‌ తీసుకుని పాపతో టైమ్‌ కేటాయిస్తాను అంటూ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెల్సిందే.

Tags:    

Similar News