ఖాన్ త్రయం.. ఇది రణబీర్ టైమ్

బాలీవుడ్ ఇండస్ట్రీ పేరు చెప్పగానే.. మనకు ముగ్గురు ఖాన్ లు ఎక్కువగా గుర్తొస్తారు. మూడు దశాబ్దాలుగా షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ బీటౌన్ ను ఏలుతున్నారు.

Update: 2023-12-07 17:30 GMT

బాలీవుడ్ ఇండస్ట్రీ పేరు చెప్పగానే.. మనకు ముగ్గురు ఖాన్ లు ఎక్కువగా గుర్తొస్తారు. మూడు దశాబ్దాలుగా షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ బీటౌన్ ను ఏలుతున్నారు. కొన్నాళ్ల పాటు వీరి సినిమాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచి భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు వీరి దగ్గర్లోకి మరో స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ వచ్చారని బాలీవుడ్ సినీ పండితులు చెబుతున్నారు.

రణ్ బీర్ కపూర్ తాజాగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పోస్టర్ లో రణ్ బీర్ పేరు ముందు సూపర్ స్టార్ అని ముద్రించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి. దీంతో రణ్ బీర్ ఆ సూపర్ స్టార్ ట్యాగ్ కు సెట్ కారంటూ చాలా మంది కామెంట్లు చేశారు. తన కెరీర్ లో రూ. 300 కోట్ల వసూలు చేసిన సినిమా ఒకటే ఉందని సూపర్ స్టార్ బిరుదుకు అర్హుడు కాదని అభిప్రాయపడ్డారు.

అయితే యానిమల్ చిత్రంతో రణ్ బీర్ అలాంటి కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమా ఏకంగా 500 కోట్లను దాటేసింది. అంతే కాకుండా 1000 కోట్లకు చేరువయ్యేలా కూడా ఉందని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇక సినిమాలో తన అద్భుతమైన నటనతో సినీ అభిమానులను మెప్పించారు. అటు నార్త్ లోనే కాదు ఇటు సౌత్ లోనూ భారీగా ప్రేక్షకులను పెంచుకున్నారు. తన యాక్టింగ్ తో థియేటర్లకు సినీ ప్రియులను రప్పించుకుంటున్నారు.

ఇప్పుడు బాలీవుడ్ లో షారుక్ తర్వాత రణ్ బీర్ బెస్ట్ యాక్టర్ అని నెటిజన్లు అంటున్నారు. పాజెక్ట్ లను జాగ్రత్తగా ఎంచుకుంటే కొత్త సూపర్ స్టార్ గా ఎదుగుతారని చెబుతున్నారు. సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులతో సినిమాలు తీస్తే రణ్ బీర్ వేరే లెవల్ లో పెరుగుతుందని చెబుతున్నారు. కొన్నేళ్ల పాటు మంచి హీరోగా రాణిస్తారని అంటున్నారు.

అయితే షారుక్ ఖాన్.. యాక్షన్ హీరోగా ఇటీవలే పఠాన్, జవాన్ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నారు. గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చారు. త్వరలో డంకీ చిత్రంతో ఎమోషనల్ గా టచ్ చేయనున్నారు.

ఇక సల్మాన్ ఖాన్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లోనే సినిమాలు చేస్తున్నాడు. ఇక టైగర్ -3తో ఈ కండల వీరుడు దీపావళికి థియేటర్లలోకి వచ్చినా మెప్పించలేకపోయారు. భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. మరో స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ దెబ్బతో ఏకంగా బ్రేక్ ప్రకటించారు. కానీ స్టార్ హోదా తో ఆయన సెలెక్ట్ చేసుకునే కాన్సెప్టులతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్నాడు. మధ్యలో హృతిక్ రోషన్ బిగ్ పొజిషన్ కోసం ట్రై చేసినా కుదరలేదు. సినిమాల సెలక్షన్ బాగోలేకపోవడం వల్ల కాస్త వెనుకబడ్డాడు. ఇక అక్షయ్ కుమార్ కెరీర్ కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. వీటన్నింటని పరిశీలిస్తే.. ఫ్యూచర్ సూపర్ స్టార్ రణ్ బీర్ కపూర్ అని చెప్పుచ్చు. యానిమల్ తరువాత దానికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ రానుంది. ఇక అప్పుడు ఈ స్టార్ హీరో రేంజ్ ఇంకా ఏ స్థాయికి.పెరుగుతుందో.

Tags:    

Similar News