టూ హార్డ్.. స్టార్ హీరో ప్రిపరేషన్ చూసి భార్య ఉద్వేగం!
ఇలాంటి సమయంలో రణబీర్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో హీట్ పెంచింది.
యానిమల్' ఘనవిజయం తర్వాత రణబీర్ లైనప్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓవైపు రామాయణం లాంటి పురాణేతిహాసాన్ని ఎంపిక చేసుకుని అతడు శ్రీరాముడిగా నటిస్తుండడం ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ చేస్తోంది. మరోవైపు భన్సాలీ లవ్ అండ్ వార్ చిత్రీకరణలోను పాల్గొననున్నాడు. ఇంతలోనే ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ 'ధూమ్ 4'లో రణబీర్ నటిస్తాడన్న కథనాలు అంతకంతకు వేడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో రణబీర్ తీవ్రంగా కసరత్తులు చేస్తున్న ఓ వీడియో ఇంటర్నెట్ లో హీట్ పెంచింది.
ఈ వీడియో చూశాక.. అతడి భార్య ఆలియాభట్ చాలా ఎమోషనల్ అయ్యారు. రణబీర్ కపూర్ ఫిట్నెస్ కోచ్ ఈ ఇంటెన్స్ వ్యాయామం నుంచి ఒక వీడియోను షేర్ చేయగా.. దీనిలో రణబీర్ హార్డ్ వర్క్ స్పష్ఠంగా కనిపిస్తోంది. క్లాప్ పుల్ -అప్లు చేస్తూ అప్రయత్నంగా తన కండరపుష్టిని ప్రదర్శిస్తూ అగ్గి రాజేస్తున్నాడు. అతడి శిక్షకుడు వీడియోకి ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ''ఇకపై పుల్-అప్లు సరిపోవని నేను అనుకుంటున్నాను.. కాబట్టి ఈ రోజు చప్పట్లు కొట్టాలని నిర్ణయించుకున్నాం'' అని రాసాడు. ఈ వీడియోను చూసిన తర్వాత ఆలియా ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయింది. దీనిపై ఫైర్ ఎమోజీలతో స్పందించింది. మేము పూర్తిగా ఏకీభవిస్తున్నామని రాసింది. పలువురు అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు కామెంట్లు చేసారు. ఫైనెస్ట్ అని ఒకరు వ్యాఖ్యానించగా.. 'అతడు ఎంత అప్రయత్నంగా ఉన్నాడు' అని వ్యాఖ్యానించాడు. మూడవ అభిమాని 'వ్వావ్' అని ఆశ్చర్యపోయాడు. మరొకడు 'లెట్స్ గూ' అని రాసాడు.
రణబీర్ - ఆలియా పవర్ కపుల్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ 'లవ్ & వార్' లో నటిస్తున్నారు. ఇందులో విక్కీ కౌశల్ కీలక పాత్రధారి. అలియా భట్ నవంబర్ 19న ముంబైలో షూటింగ్ ప్రారంభించినట్లు ఇటీవల కథనాలొచ్చాయి . ఆలియా సోలో సీక్వెన్స్‌లను భన్సాలీ చిత్రీకరిస్తున్నారు. రణబీర్, విక్కీతో కలిసి ఆలియా నటించే సన్నివేశాలు నెలాఖరులో ప్రారంభం కానున్నాయి.