మాజీ ప్రియుడితో నటించేందుకు నో..!
గతంలో సల్మాన్ ఖాన్ తో కత్రీనా కైఫ్ ప్రేమలో ఉందని.. ఆ తర్వాత కొన్నాళ్లకు బ్రేకప్ అయిందనే వార్తలు వచ్చాయి
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పలువురు హీరోలతో ప్రేమ వ్యవహారాలు నెరిపారు అనేది టాక్. ఒకానొక సమయంలో రణబీర్ కపూర్ కి బ్యాడ్ బాయ్ ఇమేజ్ ను ఒక వర్గం మీడియా కట్టబెట్టింది. ప్రస్తుతం రణబీర్ ఒక భర్తగా బుద్దిగా కొనసాగుతున్నట్లు ఉన్నాడు. అందుకే ఆయన తన మాజీ లవర్స్ తో సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.
గతంలో సల్మాన్ ఖాన్ తో కత్రీనా కైఫ్ ప్రేమలో ఉందని.. ఆ తర్వాత కొన్నాళ్లకు బ్రేకప్ అయిందనే వార్తలు వచ్చాయి. కత్రీనా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో నటిస్తోంది. బ్రేకప్ అయిన ప్రియుడితో సినిమా ను కత్రీనా చేస్తుంది కనుక ముందు ముందు రణబీర్ కపూర్ తో కూడా కత్రీనా సినిమాలు చేసే అవకాశాలు లేకపోలేదు అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది.
తాజాగా రణబీర్ కపూర్ తో ఎప్పటికి కలిసి నటించే అవకాశం లేదని కత్రీనా కైఫ్ తేల్చి చెప్పింది. తనకు ఎప్పటికీ అతడి తో కలిసి నటించాలనే ఆలోచన రాదు అంది. అతడు ట్రైయింగ్ అండ్ టెస్టింగ్ పర్సన్ అన్నట్లుగా రణబీర్ కపూర్ పై తీవ్ర స్థాయిలో కత్రీనా వ్యాఖ్యలు చేయడం జరిగింది.
రణబీర్ కపూర్, కత్రీనా కైఫ్ కాంబినేషన్ లో గతంలో అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానో, రాజనీతి మరియు జగ్గా జాసూస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2017 సంవత్సరంలో వచ్చిన జగ్గా జాసూస్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇద్దరు కలిసి కెమెరా ముందుకు రాలేదు. భవిష్యత్తులో కూడా వచ్చే దాఖలాలు కనిపించడం లేదు.