అప్పుడు రాణీ వయసు 17 కాదు..మరెంతో తెలుసా?
బెంగాలీ సినిమాతో బాలీవుడ కి ఎంట్రీ ఇచ్చిన రాణీముఖర్జీ
25 లో చేయాల్సిన పనులు 16..17 ఏళ్ల వయసులో చేస్తే అలాగే ఉంటుంది. అప్పుడు మమ్మీ అయి ఆ తర్వాత మమ్మీ కాదంటే? ఎలా! ఇలాగే రకరకాల సందేహాలు వచ్చేస్తాయి. ఇంకా నయం అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నీ పరిస్థితి ఏంటి అమ్మడు. 17 ఏళ్లు అయినా 34 చేసి నలుగురు పిల్లల తల్లివి కూడా అయిపోయేదానివి. అవును ఇదంతా ఎవర్నీ ఉద్దేశించి అనుకుంటున్నారా? ఆమె ఎవరో కాదు..బాలీవుడ్ అందం రాణీముఖర్జీ.
బెంగాలీ సినిమాతో బాలీవుడ కి ఎంట్రీ ఇచ్చిన రాణీముఖర్జీ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో హిందీ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది.
అటుపై ఆదిత్య చోప్రాని వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడింది. అలాగని రిలాక్స్ అవ్వలేదు. వృత్తి పరంగా కొనసాగుతూనే ఉంది. తాజాగా అమ్మడు కెరీర్ తొలి దశని తలుచుకుని ఆనాటి మురిసిపోయింది.
కరణ్ జోహార్ తెరకెక్కించిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాలో రాణీ ముఖర్జీ ఓ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాత్ర గురించి రాణీ ఇలా వ్యాఖ్యానించింది. 'నా కెరీర్ లో అత్యంత సవాల్ తో కూడుకున్న పాత్ర ఏదైనా ఉంది అంటే కుచ్ కుచ్ హెతా హైలో అమ్మగా నటించడం. లక్కీగా నా పాత్ర నిడివి ఎక్కువగా లేకపోవడంతో బ్రతికిపోయాను' అంది. దీనిపై నెటి జనులు రాణీ ముఖర్జీని ఆడుకోవడం మొదలు పెట్టారు.
అప్పుడు రాణి వయసు 17 కాదు..20 అని ఒకరు..కాదు కాదు అంతకు మించి అని మరికొంత మంది కామెంట్లు పెట్టారు. ఆమె కనిపించింది ఒకట్రెండు సన్నివేశాల్లోనే. అదీ పాపగా ఏదో బొమ్మని పట్టుకుని ఉంటుంది అని మరోకరు కామెంట్లు పెట్టారు.
మరి నిజంగా వయసు తక్కువైనప్పుడు 25 ఏళ్లలో చేయాల్సిన పనులు 17 ఏళ్లకే చేయడం దేనికి? అంత నామోషీగా ఉంటే ఆ పాత్ర పోషించడం మానేయాలి. అంతేకానీ అమ్మ పాత్రని అవమానించేలా మాట్లాడవద్దు అంటూ మరికొంత మంది మండిపడ్డారు.