రష్మిక డబుల్ షిఫ్టులకు సరైన రిజల్ట్ దక్కేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయారు.
స్టార్ హీరోయిన్ రష్మికకు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కిరాక్ పార్టీ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కన్నడ బ్యూటీ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు. ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మికకు గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు స్టార్ డమ్ తెచ్చిపెట్టాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో నేషనల్ క్రష్ గా మారిపోయారు. వేరే లెవెల్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.
అదే సమయంలో బాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయనే చెప్పాలి. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన గుడ్ బాయ్ మూవీలో నటించి మెప్పించారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రంతో బాలీవుడ్ సినీ ప్రియులకు బాగా దగ్గరయ్యారు. ఇప్పుడు నార్త్ టు సౌత్ అనేక సినిమాల్లో నటిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. తన అందం, అభినయంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు రష్మిక.
వరుస ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్న రష్మిక.. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం పుష్ప-2 సీక్వెల్ ను పూర్తి చేస్తున్నారు. మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. శ్రీవల్లి 2.0గా సినీ ప్రియులను మెప్పించనున్నారు. అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సికిందర్ లో రష్మిక యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ మూవీ సాంగ్స్ షూట్ లో పాల్గొంటున్నారు.
దీంతో రోజుకు రెండు షిఫ్టుల రూపంలో రష్మిక వర్క్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డే టైమ్ లో పుష్ప-2 వర్క్స్ నూ పూర్తి చేస్తున్న రష్మిక.. ఆ తర్వాత సికిందర్ షూట్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో రష్మిక బాగానే కష్టపడుతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అదే సమయంలో నేషనల్ క్రష్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ లో విక్కీ కౌశల్ తో చావా, ఆయుష్మాన్ ఖురానాతో థామా సినిమాలు చేస్తున్నారు.
సౌత్ లో పుష్ప-2తో పాటు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేరలో యాక్ట్ చేస్తున్నారు. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరో పాన్ ఇండియా సినిమా రెయిన్ బోలో నటిస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ మూవీలో కూడా హీరోయిన్ గా కనిపించనున్నారు. మరి చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక.. డబుల్ షిఫ్టులకు సరైన ప్రతిఫలం అందుకుంటారో లేదో వేచి చూడాలి.