అమ్మాయిలందరికీ రష్మిక ముఖ్య సలహా
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ గా గుర్తింపు దక్కించుకుంది.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ గా గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ లో ఇప్పటికే నటించిన సినిమాలు పెద్దగా అలరించలేదు. కానీ తాజాగా నటించిన యానిమల్ సినిమాతో రష్మిక మందన్న అక్కడ స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాల పరంగా జెట్ స్పీడ్ తో దూసుకు పోతున్న రష్మిక మందన్నా కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉన్న విషయం తెల్సిందే. ఆ మధ్య రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేసిన డీప్ ఫేక్ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ వీడియో వల్ల ఏకంగా కేంద్ర ప్రభుత్వం కూడా డీప్ ఫేక్ వీడియోలకు వ్యతిరేకంగా కదలి వచ్చింది.
యానిమల్ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఒక జర్నలిస్ట్ డీప్ ఫేక్ వీడియో గురించి రష్మిక మందన్న ని ప్రశ్నించాడు. ఆ సమయంలో మీకు వచ్చిన మద్దతు గురించి, ఆ సమయంలో మీ ఫీలింగ్స్ గురించి చెప్పండి అంటూ ప్రశ్నించిన సమయంలో సినిమా ప్రమోషన్ సందర్భంగా ఆ విషయం గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూనే ఆ విషయంలో అమ్మాయిలకు తన మంచి సలహా ఇచ్చింది.
రష్మిక మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఫేక్ వీడియోలు చాలా కామన్ అయ్యాయి. పుకార్ల గురించి ఎలా అయితే పట్టించుకోకుండా ఉంటామో ఫేక్ వీడియోల గురించి కూడా అలాగే పట్టించుకోకుండా ఉండాలని అనుకుంటూ ఉంటాను. అయితే ఆ ఫేక్ వీడియో కి నాకు అమితాబ్ జీ మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది మద్దతు నాకు లభించింది.
సాధారణంగా ఆ వీడియో లను తీసుకుంటే ఇంత మద్దతు వచ్చి ఉండేది కాదు. అందుకే అమ్మాయిలు తమ విషయంలో జరుగుతున్న ప్రతి అన్యాయం గురించి స్పందించాలి. తప్పకుండా జనాలు తెలిసే విధంగా ఆ విషయాన్ని బయటకు తీసుకు రావాలి. కచ్చితంగా సొంత వారితో పాటు బయటి వారి మద్దతు కూడా లభిస్తుంది.
మౌనంగా ఉంటే, మనలో మనం బాధపడుతూ ఉంటే మద్దతు రాదు. కనుక ఆ విషయాన్ని బయటకు తీసుకు వస్తేనే అంతా కాకున్నా కొందరు అయినా కచ్చితంగా మద్దతుగా నిలుస్తారని రష్మిక మందన్నా అమ్మాయిలకు సలహా ఇచ్చారు. ప్రస్తుతం రష్మిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.