చెంపదెబ్బకు వల వలా ఏడ్చేశాను: రష్మిక
రణబీర్ ఎంత పెద్ద స్టార్ హీరో..! అయినా అతడు ఒక అమ్మాయి చేత చెంప దెబ్బ తిన్నాడు.
రణబీర్ ఎంత పెద్ద స్టార్ హీరో..! అయినా అతడు ఒక అమ్మాయి చేత చెంప దెబ్బ తిన్నాడు. ఎమోషన్‌లో ఫెడీల్మని ఒకటిచ్చేసరికి చెంప పగిలింది. కొట్టింది ఎవరో కాదు.. రష్మిక మందన్న. ఎంత నేషనల్ క్రష్ అయినా తమ ఫేవరెట్ హీరోని చెంప దెబ్బ కొడితే అభిమానులు ఊరుకుంటారా? ఇదే టాలీవుడ్ లో అయితే రచ్చ రచ్చ అవుతుంది. బాలీవుడ్ లో కాబట్టి హిందీ అభిమానులు అర్థం చేసుకున్నారు!
ప్చ్.. మరి ఆ చెంప దెబ్బ కొట్టినప్పుడు రష్మిక ఫీలింగ్ ఏంటి? అంటే.. ఇదిగో ఇప్పుడు ఇలా ఓపెనైంది. రష్మిక మందన్న యానిమల్ చిత్రంలో అద్భుత నటనతో కట్టి పడేసింది. రణబీర్ తో కొన్ని ఎమోషనల్ సీన్లలో అయితే అదరగొట్టేసింది. ఇదే స్పీడ్ లో రణబీర్ కపూర్‌ను చెంపదెబ్బ కొట్టిన విషయం తెల్సిందే. రష్మిక ఈ చిత్రంలో రణబీర్ కపూర్ భార్య పాత్రను పోషించింది. ఒక సన్నివేశంలో రణ్‌విజయ్ (రణ్‌బీర్)ని చెంపదెబ్బ కొడుతుంది. దాని గురించి తాజా ఇంటర్వ్యూలో రష్మిక ఓపెనైంది. ఈ తీవ్రమైన సన్నివేశం ఒకే టేక్‌లో చిత్రీకరించారని, సన్నివేశం పూర్తయిన తర్వాత తాను ఏడ్చేశానని తెలిపింది.
''మొత్తం సీక్వెన్స్ ఒకటే టేక్ .. ఎందుకంటే నా పాత్రలో చాలా కదలికలు ఉన్నాయి. ఇది (చెంప దెబ్బ) ఊహించదగినది కాదు. నేను ఏం చేయబోతున్నానో నాకు తెలియదు. ఈ పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ఫీల్ అవుతాడో దానిని అనుభూతి చెందాలని సందీప్ నాకు చెప్పాడు. నాకు ఇది మాత్రమే గుర్తుంది. యాక్షన్ .. కట్ మధ్య నాకు ఏమీ గుర్తు లేదు. నేను దానిని ప్రాసెస్ చేయలేను. నా మెదడు ఖాళీ(బ్లాంక్) అయింది''అని రష్మిక తెలిపింది.
సన్నివేశం పూర్తయినా కానీ.. తాను ఇంకా ఆ క్షణంలోనే ఉండిపోయానని.. షాట్ పూర్తయిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నానని రష్మిక చెప్పింది. రణబీర్ వద్దకు వెళ్లి అతడు బాగున్నాడా? అని కూడా అడిగిందట. ``ఆ సీక్వెన్స్ తర్వాత నేను నిజంగా ఏడ్చాను. నేను అతడి(రణబీర్)ని చెంపదెబ్బ కొట్టాను.. నేను అతడిపై అరుస్తున్నాను.. గందరగోళం జరుగుతోంది.. ఇంతలోనే తేరుకుని నేను రణబీర్ వద్దకు వెళ్లి, ``అది సరేనా? బాగున్నారా?`` అని అడిగాను.. అని తెలిపింది. ఈ సన్నివేశాన్ని ఒకే టేక్‌లో చిత్రీకరించారని, మేము ఆ సన్నివేశ క్రమాన్ని సగం రోజులో పూర్తి చేసామని రష్మిక వెల్లడించింది. ``నేను దీన్ని ఇష్టపడ్డాను.. ఒక నటిగా ఇది గొప్పదని ఆ క్షణంలో నేను గ్రహించాను. దర్శకరచయితలు ప్రతిసారీ ఇలాంటి సన్నివేశాలను రాయరు. ఈ సినిమాలో ఈ సీక్వెన్స్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేనే ఆశ్చర్యపోయాను`` అని రష్మిక ఎమోషనల్ అయింది.
యానిమల్ కథాంశం ఒక తీవ్రమైన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతడికి తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. తండ్రితో అతడి విషపూరిత సంబంధం చాలా ఎమోషన్ ని రగిలిస్తుంది. మెషిన్ గన్‌తో 200 మందిని కాల్చివేయడానికైనా వెనకాడని సీరియస్ పాత్ర అది. తన తండ్రిని రక్షించడానికి ఎంతకైనా తెగించే విజయ్ (రణబీర్ పోషించిన పాత్ర) పాత్రలో రణబీర్ నిజంగా అద్భుతంగా కనిపించారు. తండ్రిగా అనీల్ కపూర్ నటించగా అతడితో పోటీపడుతూ రణబీర్ నటించిన సంగతి తెలిసిందే. తండ్రి పాత్రధారి కొడుకుతో సన్నిహితంగా ఉండేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మానసికంగా అందుబాటులో లేని తన తండ్రి (అనిల్ కపూర్ పోషించాడు) నుండి ఒక గొప్ప కొడుకుగా ఆమోద ముద్ర పొందడానికి కష్టపడేవాడిగా రణబీర్ ఎంతో ఎమోషన్ ని పండించాడు. రణబీర్ తన కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడని క్రిటిక్స్ ప్రశంసించారు. యానిమల్ ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మార్కును అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా 900కోట్లు వసూలు చేసింది.