రష్మిక ఫేక్ వీడియో.. VD స్ట్రాంగ్ రియాక్షన్
రష్మిక మందన్న ఫేస్ మార్ఫింగ్ తో ఉన్న ఒక AI ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసింది
రష్మిక మందన్న ఫేస్ మార్ఫింగ్ తో ఉన్న ఒక AI ఫేక్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం తెలిసింది. ఒక విధంగా సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్న.అమ్మాయిలకు కూడా ఇది ఒక హెచ్చరికగా మారింది. ఇలా వీడియోలను క్రియేట్ చేసే వారిని అరికట్టకపోతే ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తుంది అని ప్రముఖులు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
బ్రిటిష్ ఇండియన్ జారా పటేల్ అనే అమ్మాయి శరీరానికి రష్మిక మందన్న మొహం కనిపించేలా AI టెక్నాలజీతో మార్చిన తీరు నిజంగా షాకింగ్ అని చెప్పాలి. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు రావడం కొత్తవి కాదు. గతంలో కూడా చాలాసార్లు వైరల్ అయ్యాయి. అయితే ఈసారి ఆ టెక్నాలజి మరింత హద్దులు దాటింది.
ఇక ఇప్పుడు రష్మిక మందన్నకు చేదు అనుభవం ఎదురు కావడంతో స్టార్ సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు సాధారణ మహిళలకు కూడా కలుగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఇక వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
వెంటనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఇలాంటి వీడియోలు కనిపించకుండా చేయాలి అనే ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే జైలు శిక్ష కూడా పడుతుంది అని హెచ్చరించారు. ఇక ఈ విషయంపై కూడా పలువురు సెలబ్రిటీలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు.
విజయ్ దేవరకొండ కూడా తన వివరణ ఇచ్చాడు. ఇది నిజంగా హర్షించదగిన విషయం అంటూ ఇలాంటి నిర్ణయాలు తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే మరోసారి ఇంకో మహిళ ఈ విధంగా ఇబ్బందులు పడకూడదు అలాగే ఇలాంటి ఘటనలపై వీలైనంత తొందరగా చర్యలు తీసుకునేందుకు ఓ టీమ్ కూడా ఏర్పాటు చేయాలి, ఇలా తప్పులు చేసే వారిపై వెంటనే శిక్షలు పడేలా చట్టాలు అమలు కావాలి. అప్పుడే మహిళలు రక్షించబడతారు.. అని విజయ్ దేవరకొండ చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.