రష్మిక డీప్ ఫేక్ వీడియో.. రంగంలోకి పోలీసులు..!

రష్మిక కూడా సాంకేతికను తప్పుగా వాడుతున్నారని ఇదే స్కూల్ డేస్ లో జరిగి ఉంటే ఏమయ్యే దాన్నో అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

Update: 2023-11-11 11:37 GMT

నేషనల్ క్రష్ రష్మికకు సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. డీప్ ఫేక్ యాప్ తో రష్మిక ఫేస్ ని మార్ఫింగ్ చేసి ఆ వీడియోని వదిలారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. అంతేకాదు రష్మికకు సపోర్ట్ గా ఎంతోమంది సినీ సెలబ్రిటీస్ ముందుకొచ్చారు. రష్మిక కూడా సాంకేతికను తప్పుగా వాడుతున్నారని ఇదే స్కూల్ డేస్ లో జరిగి ఉంటే ఏమయ్యే దాన్నో అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చింది.

ఇక రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కేంద్రం కూడా సీరియస్ గా తీసుకుంది. వెంటనే పోలీసులను రంగంలోకి దించింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియో ఎవరు చేశారు.. ఏ ఐడీ నుంచి అప్లోడ్ అయ్యింది లాంటి వివరాలను సేకరించే పనిలో పోలీసులు యాక్షన్ లోకి దిగారు.

ఇలాంటి వీడియోల వల్ల హీరోయిన్స్ కచ్చితంగా బాధపడే అవకాశం ఉంటుంది. ఏ.ఐ టెక్నాలజీ వల్ల ఉపయోగకరమైన విషయాలను చేస్తే బెటర్ కానీ ఇలా మిస్ యూజ్ చేసేందుకు అయితే కాదు. ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. కథానాయికల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వారికి కఠిన శిక్ష పడేలా చేయాలని అంటున్నారు.

డీప్ ఫేక్ వీడియో వల్ల ఎంతోమంది జీవితాలకు అన్యాయం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఇలాంటి యాప్ ల మీద కేంద్రం రద్దు చేయగా మరికొన్నిటి మీద సమీక్ష జరుగుతుంది. డీప్ ఫేక్ యాప్ లతో ఇలా ఎవరైనా ఇక ముందు చేస్తే వారికి కఠినంగా శిక్షించేలా చట్టం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో రష్మిక చాలా ధైర్యంగా నిలబడింది. అందుకే ఆమెకు తగిన న్యాయం చేయాలని పోలీసులు విచారణ చేపట్టారు.

తెర మీద కథానాయికలుగా కనిపించినంత మాత్రాన హీరోయిన్స్ ని ఇలా ఇష్టం వచ్చినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తున్న వారికి ఈసారి కేంద్రం గట్టి చర్యలే తీసుకునేలా చట్టం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట. మహిళలను కించపరచేలా ఫేక్ యాప్ లు, వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు చేయడం వల్ల కఠిన శిక్షలు పడేలా చట్టం తీసుకు రావాలని అనుకుంటున్నారు.

Tags:    

Similar News