ర‌ష్మిక‌...కీర్తి సురేష్ చుట్టూ లేడీ ఓరియేంటెడ్!

లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌నేవి ఫాంలో ఉన్న భామ‌ల‌కే వ‌చ్చే అవ‌కాశాలు. స‌మంత ఏడాది పాటు విశ్రాంతి లో ఉంది.

Update: 2023-10-01 13:30 GMT

లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌నేవి ఫాంలో ఉన్న భామ‌ల‌కే వ‌చ్చే అవ‌కాశాలు. స‌మంత ఏడాది పాటు విశ్రాంతి లో ఉంది. అనారోగ్యం బారిన ప‌డ‌టంతో పూర్తిగా కోలుకునే వ‌ర‌కూ ఎలాంటి సినిమాలు చేయ‌కూడ‌ద‌ని అమెరికా వెళ్లిపోయింది. దీంతో స‌మంత రేస్ నుంచి త‌ప్పుకున్న‌ట్లు అయింది. ఇక అనుష్క ఇటీవ‌లే కంబ్యాక్ అయినా! అమ్మ‌డికి ఎందుక‌నో మున‌పటిలా అవ‌కాశాలైతే రావ‌డం లేదు.

ఇక త‌మ‌న్నా..కాజ‌ల్ అగ‌ర్వాల్ లాంటి భామ‌లున్నా సోలోగా బాక్సాఫీస్ ని షేక్ చేసే స‌త్తా లేదు. ఇక యువ నాయ‌కలు కొంద‌రు వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నారు. వాళ్ల‌పై కోట్ల రూపాయ‌లు వెచ్చిచ‌డం అన్న‌ది సాహ‌సంతో కూడుకు న్న ప‌నే. ఈ నేప‌థ్యంలో ఉమెన్ సెంట్రిక్ చిత్రాల కోణంలో చూస్తే నిర్మాత‌ల‌కు ర‌ష్మిక మంద‌న్న‌..కీర్తి సురేష్ మాత్ర‌మే ఆప్ష‌న్ గా క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికే ర‌ష్మిక పాన్ ఇండియాలో గుర్తింపు ద‌క్కించుకుంది.

బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ప్ర‌స్తుతం `రెయిన్ బో` అనే లేడీ ఓరియేంటెడ్ సినిమా కూడా ప‌ట్టాలెక్కించింది. `సీతారామం` సినిమాలో పాత్ర చిన్న‌దైన త‌న‌దైన మార్క్ వేసింది ర‌ష్మిక‌. దీంతో ర‌ష్మిక‌పై నిర్మాత‌ల‌కు న‌మ్మ‌కం రెట్టింపు అవుతుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా అమ్మ‌డికి మ‌రో ఉమెన్ సెంట్రిక్ ఛాన్స్ అందుకున్న‌ట్లు తెలుస్తోంది. రాహుల్ ర‌వీంద్రన్ ద‌ర్శ‌క‌త్వంలో అదే త‌ర‌హా చిత్రం మ‌రోటి చేయ‌డానికి సైన్ చేసిన‌ట్లు స‌మాచ‌రాం. వాస్త‌వానికి ఈ క‌థ‌లో స‌మంత న‌టించాలి.

కానీ సామ్ ఇత‌ర వ్యాప‌కాల్లో బిజీ అవ్వ‌డంతో ఆఛాన్స్ ర‌ష్మిక‌ని వ‌రించింది. ఇదే కోవ‌లో కీర్తీ సురేష్ కూడా చ‌క్రం తిప్పుతోంది. ఇప్ప‌టికే `మ‌హాన‌టి` తో త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ని సంపాదించింది. అటుపై చేసిన కొన్ని ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌న‌ప‌ప్ప‌టికీ స‌రైన స్టోరీ ప‌డితే! కీర్తి స‌త్తా చాట‌డం ఖాయ‌మ‌న్న న‌మ్మ‌కం ద‌ర్శ‌క‌-నిర్మాత‌ల్లో బ‌లంగా ఉంది. ఈనేప‌థ్యంలో పీపూల్ మీడియా ప్యాక్ట‌రీ అమ్మ‌డితో ఓ లేడీ ఓరియెంటె డ్ చిత్రం చేసేందుకు అగ్రిమెంట్ చ‌సుకుంది. ఓ యువ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇంకా మ‌రికొంత మంది కొత్త నిర్మాత‌లు కీర్తిని లాక్ చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఫిలిం స‌ర్కిల్స్ లో వినిపిస్తోంది.

Tags:    

Similar News