సీక్వెల్‌ పై అంచనాలు పెంచిన రష్మిక..!

తెలుగు దర్శకుడు సందీప్ వంగ హిందీలో రూపొందించిన యానిమల్‌ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది

Update: 2024-01-19 12:08 GMT

తెలుగు దర్శకుడు సందీప్ వంగ హిందీలో రూపొందించిన యానిమల్‌ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.900 కోట్ల వసూళ్లు నమోదు చేసిన విషయం తెల్సిందే. భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యానిమల్ కి సీక్వెల్‌ ఉంటుంది అంటూ ఇప్పటికే దర్శకుడు సందీప్ క్లారిటీ ఇచ్చాడు.

సందీప్ తన తదుపరి సినిమాను ప్రభాస్ తో చేయబోతున్నాడు. స్పిరిట్ అనే టైటిల్‌ తో రూపొందబోతున్న ఆ సినిమా యొక్క షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభించి 2026 కి సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక బన్నీ తో కూడా సందీప్ వంగ సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.

యానిమల్‌ సినిమా యొక్క సీక్వెల్‌ కి ఇప్పటికే 'యానిమల్‌ పార్క్‌' అనే టైటిల్ ని ఖరారు చేశాడు. యానిమల్ సీక్వెల్‌ పై రష్మిక మందన్న తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ సీక్వెల్‌ లో తన పాత్ర కంటిన్యూ అవుతుందని క్లారిటీ ఇచ్చింది.

యానిమల్‌ పార్క్ లో సందీప్‌ మరింత వైల్డ్ గా పాత్రలను కథను చూపించబోతున్నాడు అంది. అంతే కాకుండా యానిమల్ ని మించిన విజయాన్ని సీక్వెల్‌ సొంతం చేసుకునే విధంగా దర్శకుడు సందీప్ వంగ సినిమాను రూపొందించబోతున్నట్లుగా ఆమె పేర్కొంది.

షూటింగ్ సమయంలో యానిమల్‌ పార్క్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను నాకు చెప్పాడు. అందులో తన పాత్ర కూడా వైల్డ్ గా కనిపించబోతుందని చెప్పుకొచ్చింది. మొదటి పార్ట్‌ లో రష్మిక ను చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ లో చూశాం. కానీ పార్ట్‌ 2 లో మాత్రం వైల్డ్ గా ఆమెను చూడబోతున్నామని తెలుస్తోంది.

రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 సినిమా తో పాటు రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లో నటిస్తోంది. మరో వైపు హిందీలో కూడా యానిమల్ విజయం తర్వాత వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కనుక ముందు ముందు రష్మిక మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News