రొమాంటిక్ లవ్ స్టోరీ కోరుతున్న రష్మిక..!
పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా నిలిచిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న
పుష్ప, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోయిన్ గా నిలిచిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. నేషనల్ క్రష్ ఇమేజ్ తో దూసుకు పోతున్న రష్మిక మందన్న ఇటీవల జపాన్ లో జరుగుతున్న క్రంచీరోల్ అనిమే అవార్డ్స్ 2024 కి హాజరు అయిన విషయం తెల్సిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్న తన ఫ్యూచర్ ఫ్లాన్స్ తో పాటు తన ప్రస్తుత సినిమాల గురించి చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ లో మంచి సినిమాలు చేయాలని, ప్రతి సారి సినిమాలో మెయిన్ లీడ్ దక్కాలంటే సాధ్యం కాదు. కనుక కొన్ని సార్లు కమర్షియల్ పాత్రలు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.
సోషల్ మెసేజ్ ఇచ్చే సినిమాలను చేయాలని కోరుకుంటున్నట్లుగా పేర్కొంది. ఇంకా రష్మిక మందన్న మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో నేను చేసిన అన్ని సినిమాలు కూడా యాక్షన్ డ్రామా సినిమాలే. కానీ నేను మాత్రం ముందు ముందు అయినా రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నాను.
ఈ మధ్య కాలంలో రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమాలు చాలా తక్కువ అయ్యాయి. ఫిల్మ్ మేకర్స్ అంతా కూడా యాక్షన్ ఎంటర్ టైన్మెంట్స్ పై పడుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాలి అంటే యాక్షన్ చేయాల్సిందే అని దర్శకులు భావిస్తున్నారు.
మరి రష్మిక మందన్న కోసం ఎవరైనా రొమాంటిక్ లవ్ స్టోరీని రెడీ చేస్తారేమో చూడాలి. ఆకట్టుకునే కథ మరియు కథనంతో మాంచి రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తే కచ్చితంగా భారీ విజయాలను సొంతం చేసుకుంటాయి. కానీ ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.
రష్మిక కోసం అయినా రొమాంటిక్ లవ్ స్టోరీని రెడీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు తమిళంలో ధనుష్ సినిమాను చేస్తోంది. అంతే కాకుండా హిందీలో కూడా రాబోయే రోజుల్లో వరుసగా సినిమాలు చేయబోతుందట.