ఆ టాలీవుడ్‌ యంగ్ హీరోకి రష్మిక సోదరి..!

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్ లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

Update: 2024-01-01 11:30 GMT
ఆ టాలీవుడ్‌ యంగ్ హీరోకి రష్మిక సోదరి..!
  • whatsapp icon

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న టాలీవుడ్ లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత గీత గోవిందం సినిమా లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఛలో మరియు గీత గోవిందం బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకోవడంతో టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా మారి, ఆ తర్వాత నేషనల్ క్రష్ గా గుర్తింపు దక్కించుకుంది.

టాలీవుడ్‌ లో రష్మిక కి అత్యంత సన్నిహితులు ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్‌ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా పెద్దగా బాండింగ్ ను పెంచుకోరు. కానీ రష్మిక మందన్న మాత్రం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తో పాటు తన మొదటి సినిమా హీరో నాగ శౌర్య ఫ్యామిలీ తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంటున్నట్లుగా సమాచారం.

తాజాగా నాగ శౌర్య తల్లి, నిర్మాత అయిన ఉషా ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్మిక మందన్న గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉషా మాట్లాడుతూ.. ఛలో సినిమా ద్వారా రష్మిక ను పరిచయం చేయడం.. ఇప్పుడు తను నేషనల్ క్రష్ గా స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవడం సంతోషంగా ఉంది.

ఛలో సినిమా షూటింగ్ ప్రారంభం సమయంలో రష్మికతో కలిసి ఆమె తల్లిదండ్రులు వచ్చే వారు. కానీ షూటింగ్‌ ప్రారంభం అయిన కొన్నాళ్లకే రష్మిక మాకు చాలా దగ్గర అయింది. నన్ను మమ్మీ అని పిలిచేంత సాన్నిహిత్యం ఆమెకు ఏర్పడింది. నన్ను మా వారిని మమ్మీ డాడీ అని పిలుస్తూ మాలో ఒక అమ్మాయిగా కలిసి పోయింది.

రష్మిక ఉషా ప్రసాద్‌ దంపతులను రష్మిక మందన్న మమ్మీ డాడీ అని పిలవడం ద్వారా నాగ శౌర్య కి ఆమె సోదరి అన్నట్లే కదా అంటూ ఇప్పుడు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఉషా ప్రసాద్‌ తాజా ఇంటర్వ్యూలో రష్మిక మందన్న గురించి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Tags:    

Similar News