మద్యానికి బానిసై.. విక్రమార్కుడు రవి పరిస్థితి ఇది..!
ఐతే అతని జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంట్ అతన్ని తన ఫ్యామిలీకి దూరం చేసింది.
జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు.. హాయిగా సాగిపోతుంది అనుకుంటున్న టైం లో అనుకోని సంఘటనలు జీవితాన్ని తలకిందులు చేస్తాయి. అలాంటి పరిస్థితే చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ జీవితంలో జరిగింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన రవి రాథోడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే అతని జీవితంలో జరిగిన ఒక యాక్సిడెంట్ అతన్ని తన ఫ్యామిలీకి దూరం చేసింది.
రవి ఫ్యామిలీ ఇంకా అతని గ్రాండ్ మదర్ కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుంచి రవి మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాడు. తాగుడికి బానిస అయ్యాడు. రీసెంట్ గా అతన్ని గుర్తించి అతని పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేయగా తన కుటుంబ లేకుండా తాను బ్రతకలేకపోతున్నా అని.. తాగకపోతే వారు గుర్తుకొస్తారని అందుకే రోజు మద్యం తాగుతానని చెప్పాడు.
అంతేకాదు తనకు కూడా సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయని.. ఫ్యామిలీ దూరమైన సంఘటన మర్చిపోలేకపోతున్నా అని అన్నాడు. అతని పరిస్థితి చూస్తే ఎలాంటి వారికైనా కళ్ల వెంట నీరు వచ్చేస్తుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా చివరగా SMS సినిమా లో నటించిన రవి తన కుటుంబం మొత్తం కోల్పోయి ఒంటరి వాడయ్యాడు. ప్రస్తుతం హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతూ కనిపిస్తున్నాడు.
ఒకప్పుడు సినిమాల్లో చైల్డ్ రోల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించిన రవి ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. రవి ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్లు ఉన్నాయి. అందులో విక్రమార్కుడు, ఆంధ్రావాలా, బొమ్మరిల్లు, ఖండ్గం, శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమాలు ఉన్నాయి. రవి రాథోడ్ గురించి విన్న తెలిసిన వారంతా కూడా అతను తిరిగి మామూలు మనిషిగా మారాలని అతని డిప్రెషన్ పోగొట్టేలా ఎవరైనాస్ సరైన గైడెన్స్ ఇస్తే బాగుంటుందని అంటున్నారు.
రవి రాథోడ్ వీడియో చూసిన చాలామంది అతని పరిస్థితిని అర్థం చేసుకుని జాలి పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు పరిశ్రమలో చిన్నప్పుడే ఎన్నో సినిమాల్లో నటించిన రవి పరిస్థితి ఇలా అవ్వడం పట్ల పరిశ్రమ పెద్దలు కూడా అతనికి తగిన సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని అంటున్నారు. తను మాట్లాడే విధానం చూస్తేనే అతను ఎంత్ డిప్రెషన్ లో ఉన్నాడన్నది అర్థమవుతుంది.