మహేష్ - బాలయ్య.. ఇప్పుడు రవితేజ!
గత ఏడాది పలు సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించారు. ఇప్పుడు 2025లో అనేక మూవీస్ ను తీసుకురానున్నారు.
టాలీవుడ్ నిర్మాత సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. లైనప్ లో క్రేజీ చిత్రాలు చేర్చుకుంటూ అదరగొడుతోంది. తద్వారా యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ మంచి హిట్స్ అందుకుంటున్నారు. గత ఏడాది పలు సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించారు. ఇప్పుడు 2025లో అనేక మూవీస్ ను తీసుకురానున్నారు.
రీసెంట్ గా నాగవంశీ నిర్మించిన డాకు మహారాజ్ మూవీ సూపర్ హిట్ అయింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఆ మూవీ.. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక రానున్న రోజుల్లో వరుసగా సితార బ్యానర్ పై రూపొందుతున్న పలు క్రేజీ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అందులో మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న మాస్ జాతర ఒకటి.
సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ.. మాస్ జాతరతో కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం.. మూవీ ద్వారా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా అని క్లియర్ గా తెలుస్తోంది. అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ కూడా సినిమాలో ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఫ్యాన్స్ చిత్రాన్ని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారనేలా టీజర్ ఉంది.
సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ ను చూసి కూడా నందమూరి ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. డాకు మ్యానియాకు థియేటర్స్ లో ఊగిపోయారు. అదే సమయంలో గత ఏడాది వచ్చిన గుంటూరు కారం మూవీలో మహేష్ యాక్షన్, రోల్ చూసి ఆయన ఫ్యాన్స్ చాలా సంబరపడిపోయారు. రమణగాడి మాస్ జాతర అంటూ ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేశారు.
అలా బాలయ్య, మహేష్ బాబుతో సితార బ్యానర్ పై నాగవంశీ రూపొందించిన రెండు సినిమాలు.. ఫ్యాన్స్ కు నచ్చేలా ఉన్నాయి. ఇప్పుడు మాస్ జాతర కూడా అలాగే ఉండనుందనే చెప్పాలి. టీజర్ లో అలాంటి వైబ్స్ ఫుల్ గా కనిపిస్తున్నాయి. దీని బట్టి చూస్తే నిర్మాతకు లక్ బాగానే కలిసి వస్తుంది. తీసుకొచ్చే స్టఫ్... మినిమమ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఫ్యాన్స్ కు బాగా నచ్చుతుందంటే లక్ కూడా ఉండాల్సిందే కదా.
అదే సమయంలో కంటెంట్ పై నెగిటివ్ రివ్యూస్ వస్తున్నా.. వసూళ్లతో పాటు బిజినెస్ విషయంలో ఎలాంటి ఢోకా ఉండటం లేదు. గుంటూరు కారం మూవీ సూపర్ హిట్ కాకపోయినా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఎలాంటి నష్టం రాలేదని వినికిడి. డాకు మహారాజ్ నాన్ థియేట్రికల్, థియేట్రికల్ తోనే సాలిడ్ ప్రాఫిట్స్ అందుకున్నారు నాగవంశీ.
అయితే కంటెంట్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఫ్యాన్స్ జోష్ లో ఉండడం వల్ల అవన్నీ పెద్దగా హైలెట్ కావడం లేదు. మంచి బిజినెస్ లు జరుగుతున్నాయి. ఇప్పుడు రవితేజ తో చేస్తున్న మాస్ జాతర ప్రయోగం కూడా అలాంటిదే. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఆ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. టైటిల్ తగ్గట్లే రవితేజను పూర్తిగా మాస్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నారు. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.