విజయ్, షారుఖ్‌ వారసుల దారిలో రవితేజ వారసుడు!

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నది కాదు.

Update: 2024-09-25 04:51 GMT

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నది కాదు. అన్ని భాషల సినిమా ఇండస్ట్రీల్లోనూ ప్రస్తుతం వారసులే ఎక్కువగా ఉన్నారు. స్టార్‌ హీరోల వారసులు ఎక్కువ శాతం ఇండస్ట్రీలోనే ఏదో ఒక రకంగా ఎంట్రీ ఇస్తున్న విషయం మనం చూస్తున్నాం. ముఖ్యంగా హీరోల వారసులు ఎక్కువగా హీరోలుగానే ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ప్రస్తుత జనరేషన్ లో మాత్రం కాస్త మార్పు కనిపిస్తుంది. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ తనయుడు దర్శకత్వం చేస్తున్నాడు, కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ తనయుడు డైరెక్షన్‌ చేస్తున్నాడు. ఇప్పుడు రవితేజ తనయుడు సైతం దర్శకుడిగా వచ్చేందుకు సందీప్ వంగ వద్ద అసిస్టెంట్‌ గా చేస్తున్నాడు.

టాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలోనూ వారసులు పెద్ద మొత్తంలో ఉన్నారు. ముందు ముందు చాలా మంది వారసులు రాబోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో వస్తున్న పారితోషికాలు, గుర్తింపు కారణంగా మరే చోట దక్కదు. అందుకే హీరోల వారసులు మాత్రమే కాకుండా దర్శక నిర్మాతల వారసులు సైతం సినిమా ఇండస్ట్రీలోనే ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్స్ కిడ్స్ ఎక్కువ శాతం హీరోలుగా ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ టాలీవుడ్ మాస్‌ మహారాజా రవితేజ తనయుడు మహాధన్ మాత్రం దర్శకత్వం పై ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మధ్య ఒక సినిమాలోనూ నటించిన ఇతగాడు త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకుంటున్నారు.

హీరోగా ఎంట్రీ ఇస్తాడని భావిస్తున్న తరుణ్ లో మహాధన్ దర్శకత్వం పై ఆసక్తిని కనబర్చుతున్నట్లుగా తెలుస్తోంది. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు సందీప్ వంగ వద్ద ప్రస్తుతం అసిస్టెంట్‌ గా మహాధన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడి వయసు తక్కువే. కనుక మరో రెండు మూడు సంవత్సరాల తర్వాత దర్శకుడిగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. దర్శకులుగా చేసిన వారు హీరోలుగా చేశారు. రవితేజ అసిస్టెంట్‌ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా హీరోగా మారిన విషయం తెల్సిందే. మహాధన్ సైతం మొదట దర్శకుడిగా చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

దర్శకుడిగా మెళకువలు నేర్చుకుంటే హీరోగా మంచి సినిమాలు ఎంపిక చేసుకునే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశ్యంతో మహాధన్‌ ప్రస్తుతం సందీప్‌ వంగ వద్ద అసిస్టెంట్‌ గా చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి మహాధన్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా వర్క్ చేస్తున్నాడు. ఈ విషయం రవితేజ ఫ్యాన్స్ కి ఒకింత నిరుత్సాహం కలిగించేదే. కానీ ముందు ముందు కచ్చితంగా వారు కోరుకున్న విధంగా సినిమా ఇండస్ట్రీలో మహాధన్ హీరోగా సినిమాలు చేస్తాడేమో చూడాలి. విజయ్‌ తనయుడు, షారుఖ్‌ ఖాన్‌ తనయుడు సైతం హీరోలుగా ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తే డైరెక్షన్‌ వైపు అడుగులు వేస్తున్నారు. వారు సైతం భవిష్యత్తులో హీరోలుగా ఎంట్రీ ఇస్తారేమో చూడాలి.

Tags:    

Similar News