మాస్ రాజాని తక్కువ అంచనా వేయలేం..!

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో రవితేజ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

Update: 2024-06-18 15:30 GMT

కెరీర్ లో కాస్త వెనకపడ్డాడు అనుకున్న ప్రతిసారి డబుల్ ఫోర్స్ తో మళ్లీ తిరిగి ఫాంలోకి వస్తాడు మాస్ మహరాజ్ రవితేజ. ధమాకా తర్వాత రవితేజ సినిమాలు అన్నీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ సినిమాలు నిరాశ పరిచాయి అయినా కూడా మళ్లీ కొత్త ఉత్సాహంతో తన నెక్స్ట్ సినిమా మిస్టర్ బచ్చన్ తో వస్తున్నాడు రవితేజ. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో రవితేజ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రవితేజ తో మిరపకాయ్ లాంటి హిట్ అందుకున్న హరీష్ శంకర్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు. ఐతే సినిమా సినిమాకు గ్యాప్ తీసుకున్నా సరే ఫుల్లీ లోడెడ్ గన్ మాదిరి తన సినిమాలు ఉంటాయని హరీష్ శంకర్ ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో రవితేజతో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. సినిమా నుంచి గ్లింప్స్ గా వదిలిన షో రీల్ మిస్టర్ బచ్చన్ మీద భారీ హైప్ ఏర్పరచింది.

Read more!

సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ లాక్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 27న ఎన్.టి.ఆర్ దేవర వస్తున్నాడు. రవితేజ సినిమానే కదా అని తక్కువ అంచనా వేయలేం. మాస్ రాజాకి మాస్ డైరెక్టర్ ఈ సూపర్ హిట్ కాంబోతో మిస్టర్ బచ్చన్ వస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఊహించిన దాని కన్నా ఎక్కువ ఇంపాక్ట్ కలుగచేస్తుంది. రవితేజ ఎనర్జీని మ్యాచ్ చేస్తూ హరీష్ శంకర్ సీన్స్ రాస్తే థియేటర్ లో మాస్ రాజా ఫ్యాన్స్ పండుగ చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు.

ఓ పక్క పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తూ దాన్ని మధ్యలో ఆపి రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తున్నాడు హరీష్ శంకర్. డైరెక్టర్ హీరో ఇద్దరు మంచి ఫైర్ మీద ఉన్నారు కాబట్టి సినిమా కూడా అదే రేంజ్ లో వస్తుంది. తప్పకుండా మిస్టర్ బచ్చన్ సినిమా మాస్ ఆడియన్స్ కు మంచి ట్రీట్ ఇస్తుందని అంటున్నారు. మరి సెప్టెంబర్ 27న సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి. రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News