RC 17 కాంబో.. డైనమిక్ డైరెక్టర్ సెట్టయినట్లే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు

Update: 2024-01-28 13:30 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది. దిల్ రాజు గేమ్ చేంజర్ మూవీని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని అనుకూలంగా జరిగితే సెప్టెంబర్ లో ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది.

దీని తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో RC 16 మూవీ సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు. ఈ సినిమా ఎనౌన్సమెంట్ ఎప్పుడో జరిగింది. అయితే శంకర్ సినిమా కంప్లీట్ చేసాక బుచ్చిబాబు మూవీని స్టార్ట్ చేయాలని చెర్రీ అనుకుంటున్నాడు. క్యారెక్టరైజేషన్, లుక్స్ పరంగా డిఫరెన్స్ చూపించాల్సి ఉండటంతో గేమ్ చేంజర్ కంప్లీట్ అయితే RC 16 సెట్స్ పైకి వెళ్లనుంది.

దీని తర్వాత RC 17 చరణ్ ఎవరితో చేసే అవకాశం ఉందనిధి ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదు. రామ్ చరణ్ లైన్ అప్ లో అయితే సుకుమార్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అయితే చరణ్ మాత్రం తనకి రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్ తో RC 17 మూవీ చేయాలని అనుకుంటున్నాడంట. భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ పై హై వోల్టేజ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా చేసే అవకాశం ఉందంట

ప్రస్తుతం సుకుమార్ పుష్ప ది రూల్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. పుష్ప ది రూల్ రిలీజ్ అయిన వెంటనే రామ్ చరణ్ తో సినిమాని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అంటే రామ్ చరణ్ తో సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబుతో సినిమా అవ్వగానే సుకుమార్ తన సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే అవకాశం ఉంది.

ప్రస్తుతం చరణ్ కాల్ షీట్స్, ప్రస్తుతం జరుగుతోన్న గేమ్ చేంజర్ షూటింగ్ గత రెండేళ్ల నుంచి కొనసాగుతోంది. ఈ మూవీ షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేస్తే నెక్స్ట్ బుచ్చిబాబు సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. అది పూర్తి కావడానికి 2025 అయ్యే ఛాన్స్ ఉంది. అంటే వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే సుకుమార్ తో రామ్ చరణ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

Tags:    

Similar News