అందుకే తంబీలు కీరవాణిని దించారా?
మరి రెహమాన్ రావాల్సిన స్థానంలోకి కీరవాణి ఎలా వచ్చారంటే? కోలీవుడ్ నుంచి ఇంట్రెస్టింగ్ విషయాలే లీకవుతున్నాయి.
ఇటీవలే శంకర్ హిట్ సినిమా 'జెంటిల్మెన్' కి సీక్వెల్ గా' జెంటిల్మెన్ -2' ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ కి గోకుల్ కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా...'జెంటిల్మెన్' నిర్మాత కె.టి .కుంజుమోన్ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడిగా తెలుగు దిగ్గజం కీరవాణిని తీసుకున్నారు. జెంటిల్మెన్ కి రెహమాన్ బాణీలు అందించగా..సీక్వెల్ బాధ్యతలు కీరవాణికి అప్పగించారు. మరి రెహమాన్ రావాల్సిన స్థానంలోకి కీరవాణి ఎలా వచ్చారంటే? కోలీవుడ్ నుంచి ఇంట్రెస్టింగ్ విషయాలే లీకవుతున్నాయి.
వాస్తవానికి ఈ సినిమాకి సంగీతం అందించమని ముందుగా రెహమన్ ని నిర్మాత కోరారుట. కానీ రెహమాన్ తిరస్కరించినట్లు వినిపిస్తుంది. ఆయన ఏ కారణంతో రిజెక్ట్ చేసారు? అన్నది తెలియదు గానీ... రెహహాన్ బిజీ షెడ్యూల్ కూడా మెయిన్ రీజన్స్ లో ఒకటి కావొచ్చు. ఆ వెంటనే కీరవాణిని లాక్ చేసారు. ఇక్కడ కీరవాణి ఎంపిక వెనుక చాలా విషయమే కనిపిస్తుంది. 'ఆర్ ఆర్ ఆర్' చిత్రంలో నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే.
ఆ చిత్రానికి..ఆ పాటకి సంగీతం అందించింది కీరవాణి. ఈ నేపథ్యంలో కుంజుమోన్ ఎక్కడా రాజీ పడలేదు. తన సినిమాకి ఆస్కార్ రేంజ్ కంపోజర్ కావాలని కీరవాణిని దించారు. రెహమాన్ కి పోటీగా కీరవాణిని తెరపైకి తెచ్చినట్లు కోలీవుడ్ లో గుస గుస వినిపిస్తుంది. పైగా జెంటిల్మెన్ -2 లాచింగ్ రోజున కీరవాణిని సాలువా..పూల మాలతో చిత్ర బృందం తరుపున సన్మానించారు.
ఓ తమిళ వేదికపై తెలుగు సంగీత దర్శకుడికి ఇలాంటి గౌరవం దక్కడం పెద్ద విషయమే. సాధారణంగా తమిళ వేదికలపై తెలుగు వారికి ఇలాంటి గౌరవాలు చాలా అరుదు. కొన్ని రకాల కారణాలు అందుకు అడ్డంకిగా కనిపిస్తాయి. కానీ తమిళ నిర్మాత అయిన కుంజుమోన్ అలాంటి వాటిని పక్కనబెట్టి కీరవాణిని సత్కరించడం నిర్మాతలందరి గౌరవాన్ని పెంచినట్లు అయింది. తమిళ పరిశ్రమ అంటే ఉండే ఓ చిన్న విమర్శని కుంజుమోన్ ఆ రకంగా తొలగించే ప్రయత్నం చేసారు.