స‌క్సెస్ క్రెడిట్ పై ర‌చ్చ‌.. క్రెడిట్ ఎవ‌రికంటే?

ఈ నేప‌థ్యంలో సినిమాలో న‌టించిన అపర్‌శక్తి ఖురానా -అభిషేక్ బెనర్జీ కూడా ఈ అంశంపై స్పందించారు.

Update: 2024-08-26 19:30 GMT

ఇటీవ‌ల రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం 'స్త్రీ-'2 వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 500 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. ఈ రేంజ్ లో విజ‌యం సాధిస్తుంద‌ని మేక‌ర్స్ ఏమాత్రం ఊహించ‌లేదు. ఓ మోస్తారు అంచ‌నాల‌తో రిలీజ్ అయింది కానీ 500 కోట్లు తెచ్చే సినిమా అవుతుంద‌ని మాత్రం గెస్ చేయ‌లేదు. ప్ర‌స్తుతం యూనిట్ అంతా స‌క్స‌స్ భాష్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో స‌క్సెస్ క్రెడిట్ విష‌యంలో నెట్టింట పెద్ద డిబేట్ న‌డుస్తోంది. ఈ స్థాయి విజ‌యానికి కార‌ణంగా కొంత మంది శ్ర‌ద్దా క‌పూర్ పని త‌నాన్ని ప్ర‌శంసించగా..మ‌రికొంత మంది రాజ్ కుమార్ రావు న‌ట‌న కార‌ణంగా హైలైట్ చేస్తున్నారు. శ్ర‌ద్దా క‌పూర్ స్క్రీన్ టైమ్ త‌క్కువ‌గా ఉంద‌ని..కొంద‌రంటుంటే? రాజ్ కుమార్ రావ్ ఇమేజ్ తో సాధించింది ఏంటి? అన్న చ‌ర్చ‌కు దారి తీసింది.

ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు అమ‌ర్ కౌశిక్ స‌క్సెస్ ని ఎంజాయ్ చేయాలి త‌ప్ప త‌ల‌కెక్కించుకోకూడ‌ద‌ని సూచించాడు. స‌మిష్టి కృషి కార‌ణంగా సినిమా ఇంత పెద్ద విజ‌యం సాధించింద‌న్నారు. సినిమాలో న‌టించిన ఏ ఒక్క‌రికీ ప్ర‌త్యేకంగా క్రెడిట్ ఇవ్వ‌కుండా విజ‌యానికి కార‌ణంమాత్రం మ‌హిళా ప్రేక్ష‌కుల‌ని హైలైట్ చేసాడు. ఈ నేప‌థ్యంలో సినిమాలో న‌టించిన అపర్‌శక్తి ఖురానా -అభిషేక్ బెనర్జీ కూడా ఈ అంశంపై స్పందించారు.

ఈ విజ‌యానికి పీఆర్ కూడా ఓ కార‌ణ‌మ‌న్నారు. 'న‌టీన‌టులు ఎవ‌రు ఎలా ప‌నిచేసారు? అన్న‌దాని గురించి వ్యాఖ్యానించ‌కూడ‌దు. సినిమా విజ‌యం సాధించిందా? ప‌రాజ‌యం చెందిందా? అన్నది ప‌క్క‌న బెడితే అంతిమ తీర్పు కేవ‌లం ప్రేక్ష‌కుల‌దే. ఎలాంటి తీర్పు ఇచ్చినా తీసుకోవాల్సిందే. అయితే బెన‌ర్జీ మాత్రం పీఆర్ కి స‌క్సెస్ క్రెడిట్ ఇవ్వ‌లేదు. సినిమా విజ‌యానికి పీఆర్ కి ఏ సంబంధం లేద‌న్నారు. సినిమా స‌క్సెస్ లో అంతా భాగ‌స్వాములే. ఏ ఒక్క‌రికీ ప్ర‌త్యేకంగా క్రెడిట్ ఇవ్వాల్సిన ప‌నిలేదు. నెట్టింట జ‌రుగుతోన్న డిబేట్ దేన్ని మార్చ‌లేదన్నారు.

Tags:    

Similar News