రేఖా చిత్రం బాక్సాఫీస్ రచ్చ..!

మలయాళ పరిశ్రమలో కమర్షియల్ హిట్ అంటే వందల కోట్ల బడ్జెట్ తో తీసి వేల కోట్లు రాబట్టడం కాదు.. సింగిల్ డిజిట్ తో సినిమా తీసి డబుల్ డిజిట్ కలెక్షన్స్ తెప్పించడంలోనే అసలైన విజయం ఉంటుందని భావిస్తారు.

Update: 2025-01-25 06:30 GMT

తెలుగు సినిమాలు ఎంత పాన్ ఇండియా హిట్ అందుకుంటున్నా కొత్త కథ, కథనం తో సినిమా తీయాలంటే మాత్రం అందరు మలయాళ పరిశ్రమ వైపు చూస్తుంటారు. అంతటా కూడా సినిమా అంటే స్టార్ హీరో.. వందల కోట్ల బడ్జెట్ అని మొదలు పెడితే.. మలయాళంలో మాత్రం కొత్త కథ.. దానికి తగిన కథనం అన్నట్టుగా స్టార్ట్ చేస్తారు. ఆ కథల్లోనే స్టార్స్ కూడా పాత్రల్లా ఇమిడిపోతారు. మలయాళ పరిశ్రమలో కమర్షియల్ హిట్ అంటే వందల కోట్ల బడ్జెట్ తో తీసి వేల కోట్లు రాబట్టడం కాదు.. సింగిల్ డిజిట్ తో సినిమా తీసి డబుల్ డిజిట్ కలెక్షన్స్ తెప్పించడంలోనే అసలైన విజయం ఉంటుందని భావిస్తారు.

అలాంటి సక్సెస్ ఫుల్ సినిమాల లిస్ట్ లో మలయాళంలో రిలీజైన రేఖా చిత్రం నిలిచింది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ లీడ్ రోల్ లో వచ్చిన సినిమా రేఖా చిత్రం. ఈ సినిమాను జోఫిన్ టి చాకో డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అందుకుంది. కేవలం 6 కోట్ల బడ్జెట్ తో రిలీజైన ఈ సినిమా ఇప్పటికి 50 కోట్ల వసూళ్లతో అదరగొట్టేస్తుంది. ఈ మిస్టరీ క్రైం థ్రిల్లర్ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి క్యామియో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

సంక్రాంతి బరిలో టొవినో థామస్ ఐడెంటిటీ రిలీజ్ ఉన్నా కూడా ధైర్యంగా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో రేఖా చిత్రం రిలీజ్ చేశారు. ఐతే సినిమా ఆశించిన దాని కన్నా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే అనస్వర రాజన్ కు సౌత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడగా ఈ సినిమా హిట్ తో మరింత క్రేజ్ పెరిగేలా ఉంది. క్రైం థ్రిల్లర్ సినిమాలు చేయాలంటే మలయాళ దర్శకులే చేయాలి అనిపించేలా చాలా సినిమాలు వచ్చాయి. వాటి సరసన రేఖా చిత్ర నిలుస్తుంది.

ఈ సినిమా ప్రస్తుతానికి మలయాళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవగా ఓటీటీ వెర్షన్ లో మిగతా భాషలు అందుబాటులోకి తెస్తారేమో చూడాలి. మలయాళం నుంచి ఏదైనా థ్రిల్లర్ సినిమా సక్సెస్ అందుకుంది అంటే ఆ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తారు.

Tags:    

Similar News