సినీ హీరో దర్శన్ దారుణ హింస ఎంతో కళ్లకు కట్టినట్లు చెప్పిన రిపోర్టు

ఈ కేసుకు సంబంధించి తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. రేణుకా స్వామిని ఎంత దారుణంగా హింసించి చంపారో ఈ రిపోర్టు చూస్తే అర్థమవుతుంది.

Update: 2024-08-14 05:05 GMT

తన ప్రియురాలు కం నటి పవిత్రను ఆన్ లైన్ వేదికగా చేసుకొని చిరాకు పుట్టిస్తున్న తన వీరాభిమానిని ఎంత దారుణంగా హింసించి చంపారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ఫోరెన్సిక్ రిపోర్టు వెల్లడించింది. కన్నడ టాప్ సినీ హీరో దర్శన్ దుర్మార్గం ఎంతన్నది బయటకు వచ్చింది. పెళ్లై.. భార్యతో సరిపడక సినీ నటి పవిత్రను టాప్ హీరో దర్శన్ నడిపించిన వ్యవహారం ఒక ఎత్తు అయితే.. దర్శన్ భార్యకు మద్దతుగా నిలుస్తూ.. నటి పవిత్రపై ఘాటు వ్యాఖ్యలు చేసేవాడు. దీనిపై ఆగ్రహానికి గురైన దర్శన్.. కిరాయి మూకను పెట్టి తన అభిమాని రేణుకా స్వామిని కిడ్నాప్ చేయటం.. ఆ తర్వాత అతను దారుణ హత్యకు గురి కావటం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి తాజాగా ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చింది. రేణుకా స్వామిని ఎంత దారుణంగా హింసించి చంపారో ఈ రిపోర్టు చూస్తే అర్థమవుతుంది. ‘‘అతని ఛాతీపై బలంగా కొట్టటంతో ఎముక విరిగి.. ఊపిరితిత్తికి గుచ్చుకుంది. తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మెదడులో రక్తస్రావం జరిగింది. హత్య చేసిన స్థలంలో నిలిచి ఉంచిన మినీ లారీకి తలను తీసుకెళ్లి బలంగా కొట్టటంతో తలకు.. వెన్నుపూసకు గాయాలు అయ్యాయి. కాలితో తన్నడంతో మర్మావయాలకు తీవ్ర గాయాలతో పాటు రక్తస్రావం జరిగింది. మోకాలు విరిగింది. కుడి కన్ను పూర్తిగా దెబ్బ తింది’’ అంటూ పేర్కొన్నారు.

చిత్ర హింసలకు గురి చేసిన నేపథ్యంలో.. అతడి ఆర్గాన్లకు గాయాలు కావటం.. అంత హింసను తట్టుకోలేక శరీరం మొత్తం గాయాలైనట్లుగా పేర్కొన్నారు. రేణుకా స్వామి మరణంపై ఫోరెన్సిక్ రిపోర్టులో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. పోస్టుమార్టం రిపోర్టు.. తాజాగా టాస్క్ ఫోర్సు నివేదిక కలిసి.. హీరో దర్శన్ కు ఆయనతో ఈ హత్య వేళలో భాగస్వామి అయిన నటి పవిత్రలకు తాజా రిపోర్టుతో వారి మీద ఉన్న కేసు ఉచ్చు మరింత బిగుసుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంపే ముందు మరీ ఇంత దారుణంగా చంపేయటమా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News