బయ్యర్లని భయపెడుతోన్న రీరిలీజ్!
క్వాలిటీ ప్రింట్ తో సూపర్ స్టార్ అభిమానులతో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా పోకిరి సినిమాని థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడ్డారు
టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ పోకిరి సినిమాతో స్టార్ట్ అయ్యింది. కరోనా తర్వాత అభిమానులు తమ హీరోలకి సంబందించిన బ్లాక్ బస్టర్ సినిమాలు మళ్ళీ థియేటర్స్ లో చూడాలనే కుతూహలంతో పోకిరి మూవీని 4కె వెర్షన్ లోకి మార్చి రీరిలీజ్ చేశారు. ఇది బాగా వర్క్ అవుట్ అయ్యింది. తక్కువ రేటుకి ఫ్యాన్స్ హక్కులు తీసుకొని మినిమమ్ థియేటర్స్ లో. అది కూడా మెయిన్ సిటీస్ లో రిలీజ్ చేశారు.
క్వాలిటీ ప్రింట్ తో సూపర్ స్టార్ అభిమానులతో పాటు రెగ్యులర్ ఆడియన్స్ కూడా పోకిరి సినిమాని థియేటర్స్ లో చూడటానికి ఇష్టపడ్డారు. తరువాత పవన్ కళ్యాణ్ తమ్ముడు, తొలిప్రేమ, ఖుషి సినిమాలు వరుసగా రీరిలీజ్ ఆయ్యాయి. వీటిలో ఖుషి చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. హైయెస్ట్ కలెక్షన్స్ ని ఈ చిత్రం సాధించింది.
అయితే రీరిలీజ్ సినిమాల పట్ల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారనే ఉదేశ్యంతో బయ్యర్లు కూడా ఫ్యాన్సీ రేటుకి హక్కులు సొంతం చేసుకుంటూ ఎక్కువ థియేటర్స్ లో పాత సినిమాలు రీరిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే వెకెండ్ మూడు రోజులు థియేటర్స్ లో ప్రదర్శించాడానికి మొగ్గు చూపించారు. ఈ విధంగానే ఆరెంజ్ సినిమాని రీరిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఖుషి సినిమాకి ఓవరాల్గా 7.46 కోట్ల గ్రాస్ వచ్చి టాప్ లో నిలవగా. రెండో స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి నిలిచింది. ఈ సినిమాని తారక్ బర్త్ డే సందర్భంగా గ్రాండ్ గా ప్రమోషన్ చేసి మరీ రీరిలీజ్ చేశారు. ఈ సినిమా ఏకంగా 4.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆరెంజ్ మూవీ 3.36 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తరువాత చిన్న సినిమా అయినా ఈ నగరానికి ఏమైంది మూవీని రీరిలీజ్ చేయగా స్ట్రైట్ రిలీజ్ అయినపుడు వచ్చిన కలెక్షన్స్ కంటే ఎక్కువ వచ్చాయి. ఏకంగా 2.71 కోట్లు కలెక్ట్ చేసింది. తరువాత ఈ ట్రెండ్ కి ఆదరణ తగ్గుతూ వచ్చింది. ఈ ఏడాదిలో దేశముదురు సినిమా రీరిలీజ్ చేసిన ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ అయితే దారుణంగా ఫెయిల్ అయ్యింది.
దీనికి తోడు రీరిలీజ్ రైట్స్ కోసం నిర్మాతలు అధికంగా డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. దీంతో బయ్యర్లకి నష్టాలు ఎక్కువయ్యాయి. ఈ కారణంగానే భైరవద్వీపం రీరిలీజ్ ఆగిపోయింది. తాజాగా 7/G బృందావన్ కాలనీ భారీ ఎత్తున రీరిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. అయితే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ రిలీజ్ బయ్యర్లని కూడా భయపెడుతోంది. అందరూ వెనక్కి తగ్గడం స్టార్ట్ చేశారు.