బాధ్యత మొత్తం మిస్టర్ పొలిశెట్టి పైనే..!
సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నవీన్ పొలిశెట్టి చాలా యాక్టివ్ గా ఉంటున్న కారణంగా అనుష్క రావడం లేదు అనే ఫీల్ కలడం లేదు.
నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో రూపొందిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే వారంలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మహేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల విషయం లో పలు సార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 7న విడుదల కాబోతుంది.
కొన్ని కారణాల వల్ల అనుష్క శెట్టి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. అప్పుడప్పుడు వినిపించినా కూడా అస్సలు అనుష్క ఎక్కడ కూడా కనిపించడం లేదు. అసలు అనుష్క మీడియా ముందుకు కనీసం ఫోటోల కోసం కూడా వచ్చేందుకు సిద్ధంగా లేదు అనే టాక్ వినిపిస్తోంది. మిస్ శెట్టి లేకపోవడంతో మొత్తం బాధ్యత మిస్టర్ పొలిశెట్టిపైనే పడింది.
విజయ్ దేవరకొండ తన సినిమా లను విభిన్నంగా జనాల్లోకి వెళ్లి ఎలా అయితే ప్రమోషన్ చేసుకుంటాడో అలాగే నవీన్ పొలిశెట్టి కూడా చాలా అగ్రెసివ్ గా యూత్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తూ సినిమాను ప్రమోషన్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. వేలాది మంది జనాలు ఉండే కాలేజ్ లకు, మాల్స్ కు ఇతర భారీ ఈవెంట్స్ కు హాజరు అవుతున్నాడు.
ఆ సమయంలో నవీన్ పొలిశెట్టికి జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా నవీన్ పొలిశెట్టి చాలా యాక్టివ్ గా ఉంటున్న కారణంగా అనుష్క రావడం లేదు అనే ఫీల్ కలడం లేదు. తనపై మేకర్స్ పెట్టుకున్న నమ్మకం ను వమ్ము చేయకుండా పూర్తి బాధ్యత తో సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు గత రెండు మూడు వారాలుగా ప్రచారం చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ మరియు టీజర్ ఇంకా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. అనుష్క మరియు నవీన్ పొలిశెట్టి కాంబో సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినిమా కచ్చితంగా యూత్ ఆడియన్స్ కి మంచి వినోదాన్ని పంచడం ఖాయం అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.