100 సినిమాల నటికి ఆ రెండిటితో తీరని వెతలు
తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి రేవతి, తన అనువాద చిత్రాలతోను తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.;
తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో నటించిన ప్రముఖ నటి రేవతి, తన అనువాద చిత్రాలతోను తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనదైన అందం, నటన, పాత్రల ఎంపికలో డ్యాషింగ్ యాటిట్యూడ్ తో రేవతి మహిళల్లోనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్నారు. నాటితరంలో భారీ ఫాలోయింగ్ పెంచింది తన గట్సీ థింకింగ్. దక్షిణాది అన్ని భాషలకు సుపరిచితురాలైన రేవతి హిందీలోను పలు చిత్రాల్లో నటించారు.
అయితే తనకు ఇష్టం లేకపోయినా తన కెరీర్ లో ఓ రెండు కమర్షియల్ చిత్రాల్లో నటించాల్సి వచ్చిందని, వాటి విజయాల్ని ఆస్వాధించలేకపోయానని రేవతి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో నటీమణులు రాజీ పడి అలాంటి పాత్రల్లో నటించాల్సి ఉంటుందని కూడా అన్నారు.
అది బాధాకరమైన సమయం. నేను ఏమి అనుభవిస్తున్నానో ఎవరికీ తెలియదు. నాకు వేరే ఎంపికలు లేనప్పుడు నాకు నచ్చని రెండు చిత్రాలలో నటించాను. అది నన్ను చాలా ఆందోళనకు గురిచేసింది. కానీ అప్పటి నుండి నేను నా ఎంపికలకు కట్టుబడి ఉన్నాను. నేను నిజంగా నమ్మే పాత్రలను మాత్రమే ఎంచుకున్నాను! అని రేవతి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు.
నాటి రోజుల్లో సవాళ్లు ఎదురైనా కానీ, అర్థవంతమైన సినిమాల్లో నటించే విధానంతో రేవతి తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ని తెచ్చుకున్నారు. రేవతి నటిగానే కాదు దర్శకనిర్మాతగాను తరతరాలుగా నటులకు ప్రేరణగా నిలుస్తున్నారు. యువ కళాకారుల నుండి తనకు లభించిన గుర్తింపుకు ఈ వెటరన్ నటి కృతజ్ఞతలు తెలిపారు. చాలా మంది సహాయ నటీమణులు తాను పోషించిన పాత్రలలో నటించడానికి ఇష్టపడతారని పలు సందర్భాల్లో రేవతి చెప్పారు. అది వింటే చాలా సంతోషం కలుగుతుందని అన్నారు.
రేవతి 1983లో కట్టతే కిలిక్కుడు అనే సినిమాతో మలయాళంలో అరంగేట్రం చేసారు. 30 సంవత్సరాలకు పైగా తన కెరీర్‌లో, ఆమె తమిళం, మలయాళం, తెలుగు , హిందీ సినిమాలలో 100 కి పైగా చిత్రాలలో నటించారు. భూతకాలం (2022) లోని తన పాత్రకు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సౌత్, కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
విక్టరీ వెంకటేష్ -ప్రేమ, ఆర్జీవీ- రాత్రి, కమల్ హాసన్- క్షత్రియ పుత్రుడు లాంటి ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్స్ లో రేవతి నటించింది. ఆర్జీవీ రాత్రి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా రేవతి నటనకు మంచి గుర్తింపును తెచ్చింది. దమ్ముంటే కాస్కో, ముద్దుల కొడుకు, బ్రహ్మోత్సవం, మేజర్, అనుక్షణం, యుద్ధం శరణం వంటి తెలుగు చిత్రాల్లోను రేవతి నటించారు. రేవతి-మణిరత్నం కాంబినేషన్ మూవీ మౌనరాగం సెన్సేషనల్ హిట్ అయింది. ఇందులో కార్తీక్, మోహన్ కథానాయకులుగా నటించారు. సలాం వెంకీ సహా పలు చిత్రాలకు రేవతి దర్శకత్వం వహించారు.
దేవాసురం (1993), అగ్నిదేవన్ (1995) వంటి మరపురాని చిత్రాలలో రేవతి నటించింది. ఈ చిత్రాలలో అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ తో కలిసి విమర్శకుల ప్రశంసలు పొందారు. నటనా రంగంలో నటీమణుల కష్టాల గురించి బహిరంగంగా మాట్లాడే మేటి నటి, ఫిలింమేకర్ రేవతి. దర్శకత్వంలోకి మహిళలు రావాలని నిరంతరం కోరుకున్నారు.