పిక్‌టాక్ : చీర కట్టి ఛార్మినార్ టీ తాగుతూ..!
'చి.ల.సౌ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ.;
'చి.ల.సౌ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో నటించడంతో పాటు, ఆ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోవడంతో రుహానీకి టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వచ్చాయి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'హిట్ : ఫస్ట్ కేస్'లో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. వరుసగా విజయాలు సొంతం చేసుకున్నప్పటికీ ఈ అమ్మడికి కాలం కలిసి రాలేదు. దాంతో స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు రాకపోవడంతో చిన్న సినిమాల హీరోయిన్‌గానే ఈమె నిలిచి పోయింది.
'డర్టీ హరి' అనే అడల్ట్ కంటెంట్ సినిమాలో డీసెంట్ పాత్రలో నటించినప్పటికీ రుహానీ శర్మకు డర్టీ హీరోయిన్ అనే పేరు వచ్చింది. ఆ సినిమా తర్వాత తెలుగులో సినిమాలు చేస్తూనే వచ్చింది. కానీ అక్కడ నుంచి ఆమెకి సక్సెస్‌లు దక్కలేదు. డర్టీ హరి తర్వాత రుహానీ శర్మ నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలో నటించి డిజాస్టర్‌ను చవిచూసింది. గత ఏడాది ఎప్పుడూ లేనంతగా సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగ నీతులు, లవ్ మీ, బ్లాక్ అవుట్ సినిమాల్లో నటించింది. వాటిల్లో ఏ ఒక్కటి హిట్ కాకపోవడంతో పాటు ఈమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో ఈ ఏడాదిలో పెద్దగా ఆఫర్లు దక్కడం లేదు. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగు సినిమాలు ఏమీ లేవు.
సినిమాల్లో ఆఫర్లు వచ్చినా, రాకున్నా పర్వాలేదు అన్నట్టుగా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా చీర కట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఒక సినిమా షూటింగ్ నిమిత్తం సింపుల్ చీర కట్టులో కాస్త ఏజ్డ్ ఉమెన్ మాదిరిగా ఔట్ ఫిట్‌లో రుహానీ శర్మ మేకోవర్ అయింది. చార్మినార్ వద్ద రుహానీ శర్మ చీర కట్టులో అందంగా కనిపిస్తూ అక్కడ టీ తాగుతూ ఉన్న ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఒక్కసారిగా వైరల్ అయింది. అక్కడి జనాల్లో కలిసి పోయినట్లుగా రుహానీ శర్మ ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చీర కట్టులో నడుము అందం చూపించడం ద్వారా ఫాలోవర్స్‌ని చూపు తిప్పుకోకుండా చేసింది.
ప్రస్తుతం ఒక తమిళ్ మూవీలో ఈమె నటిస్తోంది. ఆ సినిమాతో పాటు ఒకటి రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మరో సినిమాకు ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మాస్క్ అనే తమిళ్ మూవీలో నటిస్తున్న రుహానీ శర్మ త్వరలోనే ఒక వెబ్ సిరీస్‌లోనూ ఈమె నటించేందుకు రెడీ అవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. హీరోయిన్‌గా ప్రస్తుతానికి ఆఫర్ల కోసం వెతుక్కుంటున్న రుహానీ శర్మ ఒక్క సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ సినిమా ఆఫర్లు దక్కించుకుని, ఏదో ఒక సమయంలో హీరోయిన్‌గా సక్సెస్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.