ఆర్జీవీ మేనకోడలు పెళ్లి.. వరుడు ఎవరంటే!

సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు వర్మ హాజరు అవ్వడని అంటూ ఉంటారు.

Update: 2024-11-10 06:02 GMT

టాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుని స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌గా ఒకానొక సమయంలో టాప్‌లో నిలిచిన రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పుడు వివాదాల వర్మగా పేరు ముందు నిలుస్తున్నాడు. ఆయన తన ఫ్యామిలీ గురించి పెద్దగా పట్టించుకోడు. ఆయన ఫ్యామిలీ నుంచి కూడా పెద్దగా ఇండస్ట్రీలో ఉన్నట్టు అనిపించదు. ఆ మధ్య వర్మ ఇంట పెళ్లి జరగడంతో వార్తల్లో నిలిచిన విషయం తెల్సిందే. మళ్లీ పెళ్లి కారణంగా వార్తల్లో నిలిచాడు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు వర్మ హాజరు అవ్వడని అంటూ ఉంటారు. తాజాగా వర్మ మేనకోడలు వివాహం జరిగింది.

రామ్‌ గోపాల్‌ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ వివాహం భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిదాంబి శ్రీకాంత్‌ తో జరిగింది. ఫ్యాషన్‌ డిజైనర్‌ గా సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలోని పలువురికి సుపరిచితురాలు అయిన శ్రావ్య వర్మ వివాహ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. ప్రముఖంగా యాంకర్‌ సుమ ఈ పెళ్లి వేడుకలో సందడి చేయడం జరిగింది. ఫ్యాషన్ డిజైనర్‌ అయిన శ్రావ్య వర్మ ఎంతో మందికి తనదైన శైలి మార్క్ ఔట్ ఫిట్‌ లను ఇస్తూ ఉంటారు. అందుకే ఆ అనుబంధంతో శ్రావ్య వివాహంకు ఇండస్ట్రీ నుంచి పలువురు హాజరు అయ్యారని సమాచారం అందుతోంది.

2018లో శ్రీకాంత్‌ బ్యాడ్మింటన్ వరల్డ్‌ నెం.1 ర్యాంక్ సాధించారు. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా సుదీర్ఘ కాలంగా టాప్‌ లో ఉన్న కిదాంబి శ్రీకాంత్‌ వివాహంకు అటు క్రీడా రంగం నుంచి పలువురు ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ పెళ్లి వేడుకకి వర్మ హాజరు అయ్యాడా అంటూ చాలా మంది వాకబు చేశారని తెలుస్తోంది. అయితే వర్మ హాజరు అయిన విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ అవుతూ ఉన్నాయి.

వర్మకు ఒక మేనకోడలు ఉందని, ఆమె ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారని చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీలో యాంకర్‌ సుమతో పాటు ఎంతో మందికి పర్సనల్‌ స్టైలిస్ట్‌గానూ శ్రావ్య వర్మ వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. పలు సినిమాలకు ఫ్యాషన్‌ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరించిన శ్రావ్య వర్మ గురించి ఇప్పుడు అందరికీ తెలియడం జరిగింది. ముందు ముందు ఆమెకు మరిన్ని సినిమాల ఛాన్స్ వస్తాయేమో చూడాలి. మొత్తానికి ఒక ఇంటి వారైన శ్రావ్య వర్మ, కిదాంబి శ్రీకాంత్‌లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్‌ మీడియా ద్వారా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.



Tags:    

Similar News