రెహమాన్ ని కొట్టాలనిపించేలా కోపం తెచ్చుకున్న వర్మ!
సంచలనాల రాంగోపాల్ వర్మ-మ్యూజిక్ లెజెండ్ రెహమాన్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
సంచలనాల రాంగోపాల్ వర్మ-మ్యూజిక్ లెజెండ్ రెహమాన్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. `రంగీలా` లాంటి మ్యూజికల్ హిట్ ఆ కాంబినేషన్ లోనే సొంతం. ఇంకా వర్మ నిర్మాతగా....మణిరత్నం కాంబినే షన్ లో వచ్చిన కొన్ని సినిమాలకు రెహమాన్-వర్మ కలిసి పనిచేసారు. ఆ రకంగా రెహమాన్ తోనూ వర్మకి మంచి ర్యాపో ఉంది. అయితే చాలా కాలంగా వీళ్లిద్దరు కలిసి పనిచేయలేదు. వర్మ ఎక్కువగా బాలీవుడ్ కంపోజర్లనే తీసుకుంటున్నారు.
మరి రెహమాన్ ని ఎందుకు తీసుకోవడం లేదు? వర్మ మాటల్ని బట్టి చాలా సంగతులే ఉన్నాయని తెలుస్తోంది. రెహమాన్ తీరుకి ఏకంగా ఓ సందర్భంలో వర్మకి కోట్టాలనిపించేంత కోపం కూడా వచ్చిందిట. ఈ విషయాన్ని స్వయంగా వర్మ రివీల్ చేసాడు. ఇద్దరు ఓసినిమా కోసం పనిచేయాలని డిసైడ్ అయ్యారుట. దీనిలో భాగంగా ఓ హోటల్ లో వేర్వేరు రూమ్ ల్లో దిగారుట. తన సినిమా పాటలు ఇలా ఉండాలని రెహమాన్ కి ముందే హింట్ ఇచ్చేసాడు.
తనకి ఇలాంటి మ్యూజిక్ కావాలని చిన్న పిల్లాడికి చెప్పినట్లు మరీ చెప్పాడుట. దాని ప్రకారం రెహమాన్ కూడా తప్పకుండా బ్రదర్..మనం అనుకున్నట్లే వస్తుందని చెప్పారుట. హోట్ ల్ కి వెళ్లిన తర్వాత రెహమాన్ ని ప్రీగా వదిలేసారుట. వర్మ పని వర్మ చూసుకునే వాడుట. ఇలా ఐదు రోజులు గడిచిన తర్వాత వర్మకి ఓ ట్యూన్ పంపించాడుట. అదేం ట్యూన్ అన్నది వర్మకి అర్దం కాలేదుట. తన సినిమాకి ఏ మాత్రం సంబంధం లేకపోవడంతో వేరే వాళ్లకి పింపించాల్సింది నాకు పంపించావో చెక్ చేయ్ అన్నాడు.
దీనికి రెహమాన్ లేదు అది నీ సినిమా దే అన్నాడు. దీనికి వర్మ షాక్ అయ్యాడుట. ఆ ట్యూన్ త్యాగరాయ గాన సభల ట్యూన్ లో ఉంటుందిట. దీంతో వర్మ వెంటనే రెహమాన్ రూమ్ కి వెళ్లే సరికి టీవీ చూస్తున్నా డుట. అప్పుడు వర్మ కాస్త సీరియస్ గా అడిగే సరికి ఐదు రోజులుగా టీవీ చూస్తున్నాను..మ్యూజిక్ చేయలేదు. నీ సినిమా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ట్యూన్ చేయడం కష్టం. చెన్నైలో ఉండి చేస్తాను అని చెప్పారుట. ఇలాంటి అనుభవాలు వర్మకి ఎన్నో ఉన్నాయట రెహామాన్ తో . ట్యూన్ ఇవ్వడానికి మనిషి సహనాన్ని పరీక్షిస్తాడని వర్మ నర్మగర్బంగా చెప్పారు. దర్శకుడుకి విసుగు..చిరాకు అన్ని తెప్పించేస్తారుట రెహమాన్.