200 కోట్ల ఆస్తితో అత్యంత‌ ధ‌నిక‌ భార‌తీయ గాయ‌ని

మనం మాట్లాడుకుంటున్న గాయని తుల‌సి కుమార్. రూ. 200 కోట్ల నికర ఆస్తి విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక మహిళా గాయని.

Update: 2023-10-17 02:29 GMT

భార‌త‌దేశంలో ఎంద‌రో గొప్ప గాయ‌నీమ‌ణులు ఉన్నారు. ద‌శాబ్ధాల పాటు త‌మ గానంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అసాధార‌ణ ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్నారు. అభిమాన‌మే చాలా మందికి సంప‌ద‌. శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, నేహా కక్కర్ ఇప్పుడు భారతదేశంలోని అగ్రశ్రేణి మహిళా గాయకులుగా రికార్డుల్లో ఉన్నారు. లెజెండరీ ఆశా భోంస్లే దశాబ్దాలుగా పాడుతున్నారు. భారతీయ సంగీత పరిశ్రమలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఈ గాయకులందరూ చాలా డబ్బు, కీర్తిని సంపాదించడంలో విజయం సాధించారు. అయితే భారతదేశంలో అత్యంత ధనిక మహిళా గాయని ఎవ‌రు? అంటే ఆ పేరు ఇప్ప‌టివ‌ర‌కూ మిస్టీరియ‌స్ అని చెప్పాలి. బ‌య‌టి ప్ర‌పంచానికి అంతగా తెలియని యువ గాయని ప్ర‌ముఖ గాయ‌నీమ‌ణులంద‌రి కంటే ముందుంది. మనం మాట్లాడుకుంటున్న గాయని తుల‌సి కుమార్. రూ. 200 కోట్ల నికర ఆస్తి విలువతో భారతదేశంలోనే అత్యంత ధనిక మహిళా గాయని.

తులసి కుమార్ ప్రముఖ సినీ నిర్మాత భూషణ్ కుమార్ సోదరి. దివంగత గాయకుడు టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ కుమార్తె. త‌న‌ సోదరి కుశాలి కుమార్ నటి. తులసి కుమార్ నికర ఆస్తి విలువ నేటిత‌రం ట్యాలెంటెడ్ యువ‌గాయ‌నీమ‌ణులు శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, నేహా కక్కర్ మొదలైన వారి మొత్తం సంపద కంటే చాలా ఎక్కువ. తులసి కుమార్ 2009లో 'లవ్ హో జాయే' ఆల్బమ్‌తో గాయ‌నిగా కెరీర్ ప్రారంభించారు. అనేక సినిమాల‌కు పాడారు. వాటిలో స్కూల్ లోని ముఝే తేరీ.. బిల్లు లోని 'లవ్ మేరా హిట్'.. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై లోని 'తుమ్ జో ఆయే' లాంటి చార్ట్ బ‌స్ట‌ర్ పాటలు ఉన్నాయి. 37 ఏళ్ల గాయ‌ని హితేష్ రాల్హాన్‌ను 2015లో వివాహం చేసుకున్నారు.

శ్రేయా ఘోషల్ నికర ఆస్తి విలువ రూ. 180-185 కోట్లు. సునిధి చౌహాన్ నికర ఆస్తి విలువ రూ. 100 కోట్లకు పైగా ఉండగా, ఆశా భోంస్లే నికర ఆస్తుల విలువ రూ. 80 కోట్లకు పైగా ఉన్నట్లు క‌థ‌నాలొస్తున్నాయి. సింగింగ్ సెన్సేషన్ నేహా కక్కర్ ఆస్తి విలువ దాదాపు రూ.40 కోట్లు అని సమాచారం. వీళ్లంద‌రి కంటే తుల‌సి కుమార్ ఆస్తి విలువ ఎక్కువ‌.

Tags:    

Similar News