సంపదలో టాప్ 10 గాయకులు సంగీతదర్శకులు
స్వరమాంత్రికుడిగా, గాయకుడిగా విశిష్టమైన కెరీర్‌లో భారీ నికర ఆస్తులను సంపాదించిన వారి జాబితాలో ఏ.ఆర్.రెహమాన్ ప్రముఖుడు
భారతదేశపు అత్యంత సంపన్న గాయకుడు లేదా సంగీత దర్శకుడు ఎవరో మీకు తెలుసా? సినీరంగంలో సుదీర్ఘ కాలం మనుగడ సాగించి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా అసాధారణమైన నికర ఆస్తులను కూడబెట్టిన మొనగాళ్ల గురించి చెప్పుకుని తీరాలి. పోటీ ప్రపంచంలో ఎదురే లేకుండా ఎదిగి గొప్ప క్రేజ్ ప్రతిభతో నిరూపించుకున్న ప్రముఖులను కీర్తించకుండా ఉండలేం. భారతీయ ధనిక గాయకులు-సంగీత దర్శకుల జాబితా.. వారి నికర ఆస్తుల విలువను పరిగణిస్తే టాప్ 10లో ఉన్న గాయనీగాయకులు లేదా సంగీత దర్శకుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఏ.ఆర్. రెహమాన్:
స్వరమాంత్రికుడిగా, గాయకుడిగా విశిష్టమైన కెరీర్‌లో భారీ నికర ఆస్తులను సంపాదించిన వారి జాబితాలో ఏ.ఆర్.రెహమాన్ ప్రముఖుడు. భారతీయ సంగీత రంగంలో అత్యంత నిష్ణాతులైన.. ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా సినీసంగీతం.. కచేరీ పర్యటనలు, ఎండార్స్‌మెంట్‌లు.. రకరకాల వ్యాపారాల ద్వారా అసాధారణ ఆదాయాన్ని ఆర్జించాడు. రెహమాన్ నికర ఆస్తుల విలువ $280 మిలియన్లకు పైగా ఉందని సమాచారం. దీని విలువ భారతీయ కరెన్సీలో 2320 కోట్లు.
అరిజిత్ సింగ్:
తుమ్ హి హో, చాహున్ మై యా నా, కబీరా, ఫిర్ లే అయా దిల్ వంటి పాటలతో పాపులరైన అరిజిత్ సింగ్ లక్షలాదిగా అభిమానులను కలిగి ఉన్నారు. సంగీత పరిశ్రమలో అతడి విజయం అసాధారణం. బాలీవుడ్ సహా ఇతర ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమలలో అనేక హిట్ పాటలతో గొప్ప పేరు తెచ్చుకున్న గాయకుడు ఆయన. అతడి సంపద వందల కోట్లు. సింగ్ ఆదాయాలు ప్రత్యక్ష సంగీత కచేరీలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు. సంగీత కంపోజిషన్‌ల నుండి వచ్చిన రాయల్టీలు వగైరా వగైరా. అతని నికర ఆస్తుల విలువ $50 మిలియన్లకు పైగా ఉందని సమాచారం. 414 కోట్లకు ఇది సమానం.
సోనూ నిగమ్:
బహుభాషల్లో నేపథ్య గాయకుడు స్వరకర్తగా సోను నిగమ్ పాపులర్. బాలీవుడ్ సహా దేశంలోని చాలా భాషలలో పాడారు. విభిన్న శ్రేణి పాటలు సహా $50 మిలియన్ నుండి $60 మిలియన్ల నికర ( ఆస్తులను ఆర్జించాడు. దీని విలువ సుమారు 500 కోట్లు. 1990ల చివరలో 2000వ దశకం ప్రారంభంలో దేశంలోని సంగీత రంగంలో అత్యంత గుర్తింపు పొందిన గాయకుడిగా మారాడు. ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా ప్రతిష్టాత్మక ఫిల్మ్‌ఫేర్ అవార్డు సహా అనేక ప్రశంసలను పొందాడు.
లతా మంగేష్కర్:
భారత దిగ్గజ గాయని, గానకోకిల లతా మంగేష్కర్ $50 మిలియన్ల నికర ఆస్తులు (415కోట్లు) ఉన్నాయి. పాత తరంలో సుస్థిరమైన నేపథ్య గాయనిగా దశాబ్ధాల పాటు విశిష్ఠ సేవలందించారు. మూడు జాతీయ చలనచిత్ర అవార్డులు సహా రాయల్ ఆల్బర్ట్ హాల్ వేదికపై అలంకరించిన మొదటి భారతీయురాలిగా తన పేరు చరిత్రకెక్కింది.
యో యో హనీ సింగ్:
రాపర్, గాయకుడు అయిన యోయో హనీసింగ్ భారతదేశంలోని అత్యంత సంపన్న కళాకారులలో ఒకరు. అతడు $25 మిలియన్ల నికర ఆస్తులను కలిగి ఉన్నాడు. భారతదేశంలో అత్యంత ధనిక గాయకుడిగా అతడు స్థానాన్ని పొందాడు. యూట్యూబ్ లో ఆరంభం పాపులరై తద్వారా ఇంతటి విజయం సాధించడం గమనించదగినది.
శ్రేయా ఘోషల్:
దీవానీ మస్తానీ, మేరే ధోల్నా, మాన్వా లాగే, డోలా రే డోలా వంటి పాటలతో పాపులరైన గాయకురాలు శ్రేయా ఘోషల్. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతగా శ్రేయా పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆమె దేశంలోని అత్యంత ధనిక గాయకులలో టాప్ 10లో స్థానాన్ని కలిగి ఉంది. తన నికర ఆస్తుల విలువ $25 మిలియన్లు. శ్రేయా దేశీయంగా అంతర్జాతీయంగా అపారమైన విజయాన్ని సాధించారు. తన ఆస్తి విలువ 420కోట్లు.
దిల్జిత్ దోసాంజ్:
$20 మిలియన్ల నికర ఆస్తి (165 కోట్లు) విలువతో పంజాబీ గాయకుడు, నటుడు దిల్జీత్ దోసాంజ్ స్థాయి ఎంతో గొప్పది. భారతదేశం సహా అంతర్జాతీయంగా భారీ అభిమానులను సంపాదించుకున్నారు. గానం, నటన రెండింటిలోనూ అతడి ప్రతిభ వినోద పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా స్థిరపరిచింది. భారతదేశంలోని పంజాబ్‌లో మూలాలతో దిల్జిత్ ప్రారంభంలో గాయకుడిగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. తన మనోహరమైన స్వరం మరియు విలక్షణమైన శైలితో ప్రేక్షకులను ఆకర్షించాడు. అతని సంగీతం పంజాబీ పాప్, సాంప్రదాయ జానపదం సహా వివిధ శైలులను విస్తరించింది. అతడికి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీ కమ్యూనిటీలలో భారీ అభిమానులు ఉన్నారు.
బాద్షా:
రాపర్, గాయకుడు, పాటల రచయిత తన ప్రత్యేక శైలి.. ఆకర్షణీయమైన సాహిత్యంతో గొప్ప ప్రజాదరణ పొందారు. అతడు `గెట్ అప్ జవానీ` పాటలో యో యో హనీ సింగ్‌తో కలిసి ప్రయాణం ప్రారంభించాడు. ఇది భారీ విజయాన్ని సాధించింది. అప్పటి నుండి బాద్షా అనేక విజయవంతమైన సింగిల్స్, ఆల్బమ్‌లను విడుదల చేశాడు. భారతీయ సంగీత రంగంలో పాపులర్ వ్యక్తులలో ఒకరిగా తనను తాను స్థాపించుకున్నాడు. అతడి అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని పాటల్లో DJ వాలే బాబు, మెర్సీ, కర్ గయీ చుల్, గెండా ఫూల్ ఉన్నాయి. రాపర్ నికర విలువ $15 మిలియన్లు. దీని విలువ ఇండియన్ కరెన్సీలో 125 కోట్లు. అతడి హిట్ పాటలు, ప్రత్యేకమైన విధానం అతన్ని భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే సెలబ్రిటీలలో ఒకరిగా మార్చాయి.
సునిధి చౌహాన్:
ప్రత్యేకమైన గాత్రంతో ఉర్రూతలూగించిన మేటి గాయని. తన నికర ఆస్తుల విలువ $13 మిలియన్ల (సుమారు 107 కోట్లు)ను అధిగమించింది. 2000ల ప్రారంభంలో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన సునిధి చౌహాన్ ఎందరికో స్ఫూర్తి. సదరు గాయని బహుముఖ ప్రజ్ఞ ప్రపంచాన్ని ఆకర్షించింది. పలు భాషలలో గాయనిగా సునిధి రాణించారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డు, IIFA అవార్డు సహా సునిధి గొప్ప ప్రశంసలను అందుకున్నారు.