రిద్ధికుమార్.. అందానికి మరో పేరేమో..

లవర్ మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన నార్త్ ఇండియన్ బ్యూటీ రిద్ధికుమార్.

Update: 2024-06-05 04:59 GMT

లవర్ మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన నార్త్ ఇండియన్ బ్యూటీ రిద్ధికుమార్. రాజ్ తరుణ్ కి జోడీగా ఈ అమ్మడు టాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. తరువాత అనగనగా ఒక ప్రేమ కథ సినిమాలో రిద్ధికుమార్ నటించింది. వీటి తర్వాత మలయాళంలో హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ లో రిద్ధి కుమార్ కీలక పాత్రలో కనిపించింది. ఆమె మూవీలో కనిపించింది కొద్దిసేపే అయిన కూడా కథని మలుపు తిప్పే విధంగా ఉంటుంది. హిందీలోలోకి ఎంట్రీ ఇచ్చి సలామ్ వెంకీ మూవీలో కీలక పాత్రలో నటించింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న రాజాసాబ్ మూవీలో రిద్ధి కుమార్ ఒక హీరోయిన్ గా నటించింది.


సినిమాలతో పాటు మూడు వెబ్ సిరీస్ లలో కూడా రిద్ధి కుమార్ నటించింది. ఇదిలా ఉంటే నార్త్ ఇండియన్ బ్యూటీస్ గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గరు. సినిమాలలో సాఫ్ట్, డీసెంట్ క్యారెక్టర్స్ చేసిన కూడా ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలతో అందాల ప్రదర్శన చేస్తూ ఉంటారు. అలాగే పేజ్ 3 ఈవెంట్స్ లలో కూడా నార్త్ ఇండియన్ బ్యూటీస్ అందాలు కనిపించేలానే డిఫరెంట్ అవుట్ ఫిట్ లతో ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు.


తాజాగా రిద్ధి కుమార్ ఓ బ్యూటీ కంటెస్ట్ కి జడ్జ్ గా అటెండ్ అయ్యింది. ఈ ఈవెంట్ లో రిద్ధి కుమార్ గోల్డ్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి అదిరిపోయే లుక్ తో గ్లామర్ షో చేస్తూ ఎట్రాక్ట్ చేసింది. ఈ ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గోల్డ్ కలర్ అవుట్ ఫిట్ తో రిద్ధి ఏంజెల్ గా ఉందనే మాట ఆమె అభిమానుల నుంచి వినిపిస్తోంది.


ఈ ఫోటోతో పాటు రిద్ధి కుమార్ ఓ స్టోరీ కూడా షేర్ చేసింది. 10 ఏళ్ళ క్రితం ఇదే బ్యూటీ కంటెస్ట్ లో పాల్గొని విన్ అవ్వడం ద్వారా తన మోడలింగ్ కెరియర్ స్టార్ట్ అయ్యిందని తెలిపింది. మరల అదే షోకి ఇప్పుడు జడ్జ్ గా రావడం చాలా ఆనందంగా, గర్వంగా అనిపిస్తోందని స్టోరీలో పేర్కొంది. ఏ పోస్ట్ పై నెటిజన్లు డిఫరెంట్ గా రియాక్ట్ అవుతూ ఉండటం విశేషం.

Tags:    

Similar News