నటుడు నారాయణమూర్తికి స్వల్ప అస్వస్థత

అయితే నారాయణ మూర్తికి అసలు ఏమైంది, ఎందుకు ఆసుపత్రిలో చేరారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తోంది.

Update: 2024-07-17 11:46 GMT

ప్రముఖ సినీ నటుడు, దర్శకనిర్మాత ఆర్‌. నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తుంది .  ఆయన ఆరోగ్యం నీరసం గా ఉండటం తో బుధవారం ఉదయం హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్ లో జనరల్ టెస్ట్ లు చేయిపించుకుంటున్నట్టు తెలుస్తుంది . డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

అయితే నారాయణ మూర్తికి అసలు ఏమైంది, ఎందుకు ఆసుపత్రిలో చేరారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి చూసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

అభ్యుదయ భావాలు కలిగిన ఆర్. నారాయణ మూర్తి.. విప్లవాత్మక సినిమాలతో 'పీపుల్ స్టార్' గా పేరు తెచ్చుకున్నారు. తన స్వీయ దర్శక నిర్మాణంలో ప్రజా సమస్యలపైనే సినిమాలు తెరకెక్కిస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేశారు. 'అర్థరాత్రి స్వాతంత్ర్యం' 'చీమల దండు' 'ఎర్ర సైన్యం' 'దండోరా' 'ఊరు మనదిరా' లాంటి ఎన్నో సూపర్ హిట్లు అందుకున్నారు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా.. ఇలా 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు.

నారాయణ మూర్తి 40 ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసినప్పటికీ, ఇప్పటి వరకూ సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేదు. సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవ కార్యక్రమాలకే వెచ్చించారు. డబ్బుకు విలువ ఇవ్వకుండా ఇప్పటికీ ఒక సాదాసీదా జీవనం సాగిస్తున్నారు. అయితే ఆయన ఒకప్పటిలా యాక్టివ్ గా సినిమాలు తీయడం లేదు. చివరగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన 'యూనివర్సీటీ' చిత్రం పెద్దగా ఆడలేదు. ఆయన త్వరలోనే 'ఉక్కు సత్యాగ్రహం' అనే సినిమా తియ్యాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News