రాబిన్ హుడ్ 'శాంటా క్లాజ్'.. బెస్ట్ డేట్ కే వస్తున్నాడహో!
వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ పై సినీ ప్రియుల్లో మంచి బజ్ నెలకొన్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్.. భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.
అయితే క్రిస్మస్ కానుకగా నేడే రిలీజ్ కావాల్సిన రాబిన్ హుడ్.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా వేయాల్సి వచ్చిందంటూ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల ప్రకటించింది. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని తెలిపింది. దీంతో మూవీ కోసం సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
అదే సమయంలో మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. క్రిస్మస్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందరికీ ఫెస్టివల్ విషెస్ తెలిపారు. మా శాంటా త్వరలో బిగ్ స్క్రీన్ పై వినోదాన్ని అందించనుందని, పండుగను ఆస్వాదించండని రాసుకొచ్చారు. బెస్ట్ డేట్ కు మా శాంటా ఎంటర్టైన్మెంట్ ను అందించనుందని పోస్టర్ పై రైటప్ ఇచ్చారు.
పోస్టర్ లో నితిన్ శాంటా గెటప్ లో ఉన్నారు. ఓ చిన్నారికి గిఫ్ట్ ఇస్తూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. నెటిజన్లు స్పందిస్తున్నారు. మూవీ కోసం వెయింటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. పోస్టర్ చాలా బాగుందని, నితిన్ శాంటా గెటప్ లో క్యూట్ గా ఉన్నారని చెబుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. నితిన్ కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీగా రాబిన్ హుడ్ రూపొందుతోంది. ఆ చిత్రం కోసం ఆయన మరోసారి శ్రీలీలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే వారి కాంబోలో ఎక్స్ ట్రా ఆర్డినరీ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి బిగ్ స్క్రీన్ పై జోడీగా సందడి చేయనున్నారు నితిన్, శ్రీలీల.
అయితే శివరాత్రి కానుకగా సినిమా రిలీజ్ అవుతుందని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రాబిన్ హుడ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో? ఎలాంటి హిట్ అవుతుందో? వేచి చూడాలి.