ఆస్కార్ గెలిచిన RRR ఖాతాలో 6 జాతీయ అవార్డులు
ఆస్కార్ లలో గుర్తింపుతో పాటు ఇప్పుడు జాతీయ అవార్డుల్లోను ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు కొరియోగ్రఫీకి మ్యూజిక్ కి గాయకుడికి అరుదైన గైరవం దక్కింది.
'చంద్రయాన్ 3' ఘనవిజయంతో నేడు ప్రపంచ యవనికపై భారతదేశ జెండా రెపరెపలు కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. ఇంతలోనే భారతీయ సినిమా రంగంలో టాలీవుడ్ కి జాతీయ అవార్డుల రూపంలో జేజేలు పలకడం ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో ఉత్తమ నటుడు (అల్లు అర్జున్-పుష్ప) సహా పలు అవార్డులు సొంతం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగు సినిమా సాధించిన ఘనత దేశానికి మరింత వన్నె తెస్తోంది.
ప్రపంచ సినీయవనికపై నేడు భారతీయ సినిమా గొప్పగా వెలుగుతోంది. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో ఆస్కార్ ని గెలుచుకున్న ఆనందం ఇంకా తెలుగు వారిలో అలానే ఉంది. ఇంతలోనే ఈ భారీ చిత్రానికి 6 విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం సంచలనంగా మారింది.
ఉత్తమ సంగీత దర్శకత్వం (నేపథ్య సంగీతం): MM కీరవాణి, ఉత్తమ నేపథ్య గాయకుడు: కాల భైరవ, ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ RRR నాటు నాటు, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్ అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ విభాగంలో ఫైట్ మాస్టర్ కి పురస్కారం దక్కింది. ఇక సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా RRR అవార్డును గెలుచుకుంది.
నిజానికి 2023 RRR నామ సంవత్సరంగా డిక్లేర్ అయింది. RRRకి గోల్డెన్ గ్లోబ్స్ పురస్కారాలు సహా హాలీవుడ్ క్రిటిక్స్ పురస్కారాలు దక్కాయి. వీటన్నిటినీ మించి ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాటకు ఆర్.ఆర్.ఆర్ కి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ పురస్కారం దక్కింది. ఆస్కార్ లలో గుర్తింపుతో పాటు ఇప్పుడు జాతీయ అవార్డుల్లోను ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు కొరియోగ్రఫీకి మ్యూజిక్ కి గాయకుడికి అరుదైన గైరవం దక్కింది.