లీక్ వీడియో.. రుహని శర్మ ఓపెన్ లెటర్

ఇదిలా ఉంటే ఈ లీక్డ్ వీడియోపై రుహని శర్మ ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేసింది. వీడియోపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడంతో పాటు దానిపై తన ఆవేదనని రుహని శర్మ వ్యక్తం చేసింది.

Update: 2024-08-24 07:33 GMT

సౌత్ ఇండియన్ హీరోయిన్ రుహని శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిలాసౌ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రుహని శర్మ నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత సెలక్టివ్ గా మూవీస్ చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే రుహని శర్మని తెలుగు ఆడియన్స్ ఇప్పటి వరకు ఒక ట్రెడిషనల్ క్యారెక్టర్స్ లలోనే చూసారు. అయితే ఆమెకి సంబందించిన బోల్డ్ అండ్ ఇంటిమేట్ వీడియో ఒకటి లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

 

ఈ లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రుహని శర్మని అడల్ట్ యాక్టర్ తరహాలో ఆ వీడియోలో చూసేసరికి అందరూ షాక్ అయ్యారు. అయితే ఆ వీడియో గురించి పూర్తిగా తెలియకుండానే రుహని శర్మ మీద సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఈ లీక్డ్ వీడియోపై రుహని శర్మ ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేసింది. వీడియోపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడంతో పాటు దానిపై తన ఆవేదనని రుహని శర్మ వ్యక్తం చేసింది.

అగ్ర సినిమాలోని ఒక సన్నివేశం లీక్ అయినప్పటి నుంచి ఏదో బాధగా ఉంది. నా బాధని వివరించడానికి మాటలు రావడం లేదు. కొన్ని నెలల మా కష్టాన్ని, అంకితభావాన్ని, ఇష్టాన్ని ఇలా డిగ్రేడ్ చేయడం హృదయవిదారకంగా ఉంది. ఆర్ట్ ఫిల్మ్ ని తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, లెక్కపెట్టలేనన్ని కష్టాలు, ఎంతో శ్రమతో కూడిన ప్రయాణం ఇందులో ఉంది. అయితే మా కష్టాన్ని, కన్నీళ్ళని అర్ధం చేసుకోకుండా దానిని కొంతమంది తప్పుగా రిప్రజెంట్ చేస్తున్నారు.

ఏదో ఒకటి, రెండు సన్నివేశాల ఆధారంగా సినిమాపై ఒక ఒపీనియన్ కి వచ్చేస్తున్నారు. అగ్ర సినిమాని 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ గా ప్రదర్శించాము. ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, రివార్డులని ఈ సినిమా గెలుచుకుంది. ఇలాంటి ప్రాజెక్ట్ లో భాగం అయినందుకు నటిగా నాకు గర్వంగా ఉంది. ఈ క్యారెక్టర్ చేసినందుకు నేను అస్సలు బాధపడటం లేదు. గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఆర్ట్ మూవీస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇలాంటి చిత్రాలకి ప్రతి ఒక్కరు ఆదరించాలి.

ఆర్ట్ మూవీస్ ఎన్నో భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఈ సినిమా విషయంలో నేను మీ నుంచి రెస్పెక్ట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. అలాగే సినిమా కోసం పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ కష్టాన్ని గుర్తించండి, గౌరవించండి అంటూ రుహని శర్మ తన లేఖలో పేర్కొన్నారు. అగ్ర మూవీ రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీలోని బోల్డ్ అండ్ ఇంటిమేట్ సన్నివేశాలని కొందరు కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాగే మూవీపైన బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రుహని శర్మ బహిరంగ లేఖలో తన ఆవేదనని తెలియజేసింది.

Tags:    

Similar News