LEO రెండో భాగం బాలేదంటే ఫోన్ క‌ట్ చేసాడు!

ద‌ళ‌ప‌తి విజయ్ నటించిన లియో చిత్రానికి లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌కుడు. లియో 19 అక్టోబర్ 2023న థియేట్రికల్ గా విడుద‌లైంది

Update: 2024-01-28 14:30 GMT

ద‌ళ‌ప‌తి విజయ్ నటించిన లియో చిత్రానికి లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌కుడు. లియో 19 అక్టోబర్ 2023న థియేట్రికల్ గా విడుద‌లైంది. ఈ చిత్రం 2023లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కానీ సినిమా రెండవ భాగం నెమ్మ‌దిగా సాగింద‌ని, అంత‌గా బాలేద‌ని మిశ్రమ సమీక్షలను అందుకుంది. అదే సమస్యను ప్రస్తావిస్తూ, ద‌ళ‌ప‌తి విజ‌య్ తండ్రి ఎస్‌ఎ చంద్రశేఖర్ సినిమా విడుదలకు ముందు బలహీనమైన సెకండాఫ్ లోపాల‌ను దర్శకుడికి ఎలా ఎత్తి చూపారో తెలిపారు.

ఇటీవల జరిగిన ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో లియో చూసిన తర్వాత కనగరాజ్‌కి కాల్ చేశాన‌ని ఎస్‌.ఏ చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. ''నేను సినిమా విడుదలకు 5 రోజుల ముందు మొదటి కాపీని చూశాను. ఆ తర్వాత సినిమా డైరెక్టర్‌కి ఫోన్ చేసి ఫస్ట్ హాఫ్ సూపర్ అని చెప్పాను. కానీ సెకండాఫ్ ఫర్వాలేదని చెప్పేంత వరకు నా మాట వింటున్న దర్శకుడు ''భోజనం చేస్తున్నానని చెప్పి ఫోన్ కట్ చేసాడు''. తిరిగి కాల్ చేయలేదు.. అని తెలిపారు.

లియో సినిమా సెకండాఫ్ గురించి తాను ఒక సమస్య ఉంద‌ని చెప్పానని, విడుదలైన తర్వాత ప్రేక్షకులు దానిని హైలైట్ చేశారని చంద్రశేఖర్ ఎత్తి చూపారు. అయితే విజయ్ తండ్రి ఎవరి పేర్లను వెల్ల‌డించ‌క‌పోయినా కానీ, ఆయ‌న‌ లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను ఉద్దేశించి మాట్లాడుతున్నార‌ని అందరికీ అర్థమైంది.

ఒక ప్రెస్ ఈవెంట్‌లో లియోలో సెకండ్ హాఫ్ నెమ్మదించడంపై లోకేష్ కనగరాజ్‌ని మీడియా ప్ర‌శ్నించింది. దానికి లోకేష్ ఎంతో వినయపూర్వకంగా ఔన‌ని అంగీకరించాడు. లియో చిత్రంలో కొన్ని స్లో పోర్షన్‌లు ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ మునుముందు భాగాలలో వాటి క్లిష్టమైన వివరాలను కనుగొనడానికి ప్రేక్షకులు ఆకర్షితులవుతారని అతను చెప్పాడు. లియో కోసం తాను రూపొందించిన ప్రిల్యూడ్ కథ ప్రేక్షకులను క‌చ్చితంగా షాక్‌కు గురి చేస్తుందని కనగరాజ్ అన్నారు.

క‌న‌గ‌రాజ్ ప్రకటనతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అకా LCUలో కనగరాజ్ తదుపరి చిత్రాల గురించి ఉత్సుకతను రేకెత్తించాయి. లియో తన మిషన్ కోసం విక్రమ్ (కమల్ హాసన్ పోషించిన పాత్ర)తో కలిసి పని చేస్తాడనేది ఎగ్జ‌యిట్ చేసే అంశం.

Tags:    

Similar News