ట్విట్టర్ ఓపెన్ చేస్తే అదే.. లైలా నెక్స్ట్ లెవెల్ ఫన్..!

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న లైలా సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ మూవీ నిర్మించారు.

Update: 2025-02-08 15:02 GMT

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతి సినిమాతో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తుంటాడు. లేటెస్ట్ గా లైలా అంటూ ఒక క్రేజీ మూవీతో రాబోతున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న లైలా సినిమాను రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి ఈ మూవీ నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో సూపర్ బజ్ ఏర్పరచుకున్న ఈ లైలా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా నిర్మాత సాహు గారపాటి మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

లైలా సినిమా నిర్మించడానికి మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి ?

మెయిన్ కామెడీ. దీంతో పాటు ఒక హీరో ఇలాంటి కథని చేస్తానని యాక్సప్ట్ చేయడం నాకు చాలా నచ్చింది. అంతకుముందు కొందరు హీరోలని సంప్రదించాం. లేడి గెటప్ చేయడం అంత ఈజీ కాదు. విశ్వక్ చేస్తానని చెప్పడంతో నాకూ ఇంట్రస్ట్ కలిగి ముందుకు తీసుకెళ్ళాం.

ఇలాంటి కథలు వచ్చి చాలా కాలమైయింది. డెఫినెట్ గా బావుంటుదని నమ్మి ముందుకు వెళ్లాం. విశ్వక్ చాలా జీల్ వున్న యాక్టర్. ఈ కథ విన్నవెంటనే 'అన్న ఇది నేను చేయాల్సిన క్యారెక్టర్ ' అని చెప్పారు. ఇందులో లవ్ స్టొరీ తో పాటు ఫన్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది.

లైలా, సోను క్యారెక్టర్స్ బ్యాలెన్స్ ఎలా వుంటుంది ?

ఫస్ట్ హాఫ్ అంతా సోను వుంటాడు. తన లవ్ స్టొరీ ఫస్ట్ హాఫ్ లో వుంటుంది. అనుకోని కారణంగా తనని లైలా గా మార్చుకొని ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకుంటాడు. ఆ రీజన్ చాలా ఎమోషనల్ గా వుంటుంది.

విశ్వక్ లైలా గెటప్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది, అందరూ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యిందని అంటున్నారు. నా వరకూ లైలాకే ఎక్కువ మార్కులు వేస్తాను.

ట్రైలర్ చూస్తుంటే అడల్ట్ కామెడీ అనిపిస్తోంది. ఇలాంటివి బాలీవుడ్ లో ఎక్కువగా వర్క్ అవుతాయి కదా ?

అడల్ట్ కామెడీ అన్ని చోట్ల వుంది. ట్విట్టర్ ఓపెన్ చేస్తే కనిపించేదంతా అదే కదా. దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. హీరో లేడీ క్యారెక్టర్, కొందరికి అర్ధం కాని డెక్కన్ లాంగ్వేజ్ మాట్లాడటం వలన 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చారు కానీ సినిమాలో ఆడల్ట్ కామెడీ అంటూ ఏమీ లేదు. రెగ్యులర్ గా మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది.

యూత్ ని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తోంది ?

యూత్ ని టార్గెట్ చేశాం. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. నవ్వించాలనే ప్రయత్నంతో చేసిన సినిమా ఇది. అందులో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం.

రేపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈవెంట్ కి వస్తున్నారు కదా.. ఆయన ట్రైలర్ చూశారా ?

ట్రైలర్ చూశారు. కొత్త ప్రయత్నం చేశామని విశ్వక్ ని మెచ్చుకున్నారు. ఆయనకి ట్రైలర్ చాలా నచ్చింది. మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఆయన రావడం మా అదృష్టం.

చిరంజీవి గారితో సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ?

మే, జూన్ లో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తాం. అనిల్ రావిపూడి మార్క్ లో పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాలా వుంటుంది. వింటేజ్ చిరంజీవి గారిలా ఆయన రోల్ ఉంటుంది.

డైరెక్టర్ రామ్ నారాయణ్ గురించి ?

తన కథకు తగ్గట్టుగా విశ్వక్ ని చూపించడంలో డైరెక్టర్ వందశాతం సక్సెస్ అయ్యాడు. సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. లైలా అనే టైటిల్ దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే ఫిక్స్ చేసుకున్నాడు. తను అనుకున్నది పెర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాడు.

ఇందులో మిగతా పాత్రల గురించి ?

ఇందులో అభిమన్యు సింగ్ పాత్ర త్రూ అవుట్ వుంటుంది. ఆయన్ని విలన్ గా చూశాం. అందులో ఆయన పాత్ర అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్మెంట్ తో వుంటుంది. ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

లైలాలో ఎమోషనల్ పాయింట్ ఏమిటి ?

లైలా కంప్లీట్ ఎంటర్ టైనర్. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో వుంటుంది. అందులో మదర్ ఎమోషన్ కూడా హత్తుకునేలా వుంటుంది. సినిమా అంతా ఫన్ రైడ్ లా వుంటుంది. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకుందామని తీసిన సినిమా లైలా.

ఒక నిర్మాత కావాలని వచ్చిన వారికి మీరు ఏం చెప్తారు ?

ఫ్రాంక్ గా చెప్పాలంటే మార్కెట్ కొంచెం ఇబ్బంది గానే వుంది. మనం అనుకున్న బడ్జెట్ లో చూసుకుంటే హ్యాపీ. పెరిగితే ఎవరికైనా ఇబ్బందే.

కథలో మీ ఇన్వాల్మెంట్ ఎలా వుంటుంది ?

కథ నచ్చిన తర్వాతే ముందుకు వెళ్తాం. ప్రాసెస్ లో మార్పులు అనేవి జరుగుతునే వుంటాయి. నాకు ఏదైనా అనిపిస్తే చెప్తాను. లాస్ట్ ఎడిట్ లాక్ చేసేదాక అన్నిట్లో ఇన్వాల్ అవుతాం.

బెల్లంకొండ గారితో తీస్తున్న సినిమా గురించి ?

డెబ్బై శాతం షూటింగ్ ఫినిష్ అయ్యింది. అది హారర్ థ్రిల్లర్. జూన్ లో రిలీజ్ చేస్తాం. ఈ సినిమాతో పాటు మరిన్ని కొన్ని అనౌన్స్ చేయబోయే మూవీస్ వున్నాయి. స్క్రిప్ట్ మీద వర్క్ జరుగుతోంది.

Tags:    

Similar News