'గేమ్ ఛేంజ‌ర్' లో ప్లాష్ బ్యాక్ ఆ మూడు సినిమాల రేంజ్ లో!

ఆర్సీ 15 `గేమ్ ఛేంజ‌ర్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-12-21 09:30 GMT

ఆర్సీ 15 `గేమ్ ఛేంజ‌ర్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ రి 10న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం మొద‌లైంది. సినిమాకి ప‌నిచేసిన వారంతా ఎవ‌రి స్టైల్లో వారు `గేమ్ ఛేంజ‌ర్` ని పైకి లేపుతున్నారు. చ‌ర‌ణ్ పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌ని..ఎలాంటి పాత్ర‌లు పోషిస్తున్నాడు? అన్న‌ది రివీల్ చేసారు. ద‌ర్శ‌కుడు శంక‌ర్ సైతం `గేమ్ ఛేంజ‌ర్` ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ చిత్రంగా చెప్పుకొచ్చారు.


అలాగే చ‌ర‌ణ్ త‌న పాత్ర‌లో ఎలా న‌టించాడు? ఆ పాత్ర‌ల కోసం తానెంత క‌ష్ట‌ప‌డ్డాడో రివీల్ చేసారు. త‌న పాత సినిమాలు వైఫ‌ల్యం చెందినా? `గేమ్ ఛేంజ‌ర్` తో అన్ని లెక్క‌లు బ్యాలెన్స్ అవుతాయ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఈ నేప‌థ్యంలో తాజాగా `గేమ్ ఛేంజ‌ర్` కి రైట‌ర్ గా ప‌నిచేసిన సాయిమాధ‌వ్ బుర్రా సినిమా గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చారు. సినిమాలో ప్లాష్ బ్యాక్ రివీల్ చేసారు. ఎఫెక్టివ్ ప్లాష్ బ్యాక్ లు చూపించ‌డంలో శంక‌ర్ స్పెష‌లిస్ట్.

`జెంటిల్మెన్`,` భార‌తీయుడు`,` జీన్స్` లాంటి క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల్లో ఎలాంటి ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఉంటాయో? ఆ రేంజ్ ప్లాష్ బ్యాక్ `గేమ్ ఛేంజ‌ర్`లోనూ ఉంద‌`న్నారు. దీంతో గేమ్ ఛేంజ‌ర్ కి అద‌నంగా మ‌రో ఎలివేష‌న్ తోడైంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. మెగా అభిమానుల్లో అంచ‌నాలు ఇంకా పెరిగి పోతున్నాయి. సాయి మాధ‌వ్ వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి శంక‌ర్ మార్క్ సినిమా వ‌స్తుందంటూ కొత్త పోస్టులు ద‌ర్శ‌న మిస్తున్నాయి.

సాయి మాధ‌వ్ గ‌తంలో స్టార్ హీరోల చిత్రాల‌కు మాట‌లు అందించిన సంగ‌తి తెలిసిందే. కృష్ణం వందే జ‌గ‌ద్గురం, గోపాల గోపాల , స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్, గౌత‌మీ పుత్ర‌శాత‌క‌ర్ణి, ఖైదీ నెంబ‌ర్ 150, మ‌హానటి , ఎన్టీఆర్ కథానాయ‌కుడు, సైరా న‌ర‌సింహారెడ్డి ఇలా ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల‌కు డైలాగులు రాసారు.

Tags:    

Similar News