గంజా శంకర్ క్యాన్సిల్… మెగా హీరో ఏమన్నారంటే..
తాజాగా మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా గురించి ప్రశ్నించారు.
సంపత్ నంది దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ గంజా శంకర్ సినిమాని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కనుంది. అయితే ఆ మధ్యకాలంలో కొన్ని వెబ్ సైట్స్, మీడియా ఛానల్స్ లో గంజా శంకర్ మూవీ ఆగిపోయిందని, ఆ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డ్రగ్స్ కంట్రోల్ పోలీసులు చిత్ర యూనిట్ కి నోటీసులు ఇచ్చారనే ప్రచారం నడిచింది.
తాజాగా మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా గురించి ప్రశ్నించారు. ఈ ఈవెంట్ లో భాగంగా తల్లి పేరు ఉండేలా తన పేరుని సాయి దుర్గా తేజ్ గా మార్చుకుంటున్నట్లు కూడా తేజ్ చెప్పుకొచ్చాడు. అలాగే గంజా శంకర్ సినిమా ఆగిపోయిందనే విషయం లో వెబ్ సైట్స్ లో వార్తలు చూసినంత వరకు నాకు తెలియదని చెప్పుకొచ్చాడు.
అలాగే టైటిల్ కాంట్రవర్సీ అనే విషయం కూడా వెబ్ సైట్స్ లో చూసిన తర్వాత తెలిసింది తప్ప అంతకు మించి ఎలాంటి సమాచారం లేదు అంటూ సెటైరికల్ గా రియాక్ట్ అయ్యాడు. అలాగే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందనే విషయాన్ని మీడియా ద్వారానే వింటున్నానని, నాకు ఇంకా క్లారిటీ లేదని తేజ్ చెప్పడం విశేషం. ఆయన మాటలతో గంజా శంకర్ పై గాసిప్స్ రాసిన వారికి సెటైర్స్ వేసినట్లు అయ్యింది.
అయితే మూవీ ఉందా లేదా అనే విషయంపై మాత్రం తేజ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే సోల్ ఆఫ్ సత్య థీమ్ తో గతంలో నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో కలర్స్ స్వాతితో కలిసి తేజ్ ఒక సాంగ్ చేశారు. ఇప్పుడు మరోసారి విమెన్స్ డే సందర్భంగా అదే థీమ్ తో ఇంకో సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఇందులో విమెన్ ఫ్రీడమ్ కాన్సెప్ట్ ని హైలైట్ చేస్తున్నట్లు ఈ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. యాక్సిడెంట్ తర్వాత అమ్మ మళ్ళీ నాకు పునర్జన్మ ఇచ్చింది. అందుకే అమ్మ పేరు నా పేరులో ఉండేలా సాయి దుర్గా తేజ్ అని మార్చుకున్న అని తేజ్ ఈ మీడియా సమావేశంలో స్పష్టం చేశాడు.