మెగా సినిమాకు అలాంటి సమస్యలా..?
మెగా హీరోల్లో మొదటి సినిమాతోనే మాస్ ఆడియన్స్ కు దగ్గరైన సాయి ధరం తేజ్ యాక్సిడెంట్ ముందు వరకు కెరీర్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్లాడు
మెగా హీరోల్లో మొదటి సినిమాతోనే మాస్ ఆడియన్స్ కు దగ్గరైన సాయి ధరం తేజ్ యాక్సిడెంట్ ముందు వరకు కెరీర్ లో ఓ రేంజ్ లో దూసుకెళ్లాడు. అంతకుముందు కూడా ఫ్లాపులు ఉన్నా కెరీర్ మీద ఎఫెక్ట్ పడేంత అయితే కనిపించలేదు. అయితే ఆఫ్టర్ యక్సిడెంట్ సాయి ధరం తేజ్ లో ఏదో ఒక మెరుపు మిస్ అయ్యిందని తెలుస్తుంది. మెగా ఫ్యాన్స్ కూడా అది భావిస్తున్నారు. ఆ యాక్సిడెంట్ లో సాయి ధరం తేజ్ తలకు గాయమవ్వడం వల్ల దాదాపు చాలా కాలం కోమాలో ఉండి ఫైనల్ గా బయట పడ్డాడు. ఏడాది పాటు బెడ్ మీద ఉన్న తేజ్ మళ్లీ సినిమాలు చేయగలడా అనుకున్నారు కానీ మెగా ఫ్యాన్స్ ఆశీస్సులతో తిరిగి కెమెరా ముందుకు వచ్చాడు.
విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న తేజ్ తన నెక్స్ట్ సినిమా మామయ్య పవన్ కళ్యాణ్ తో చేశాడు. బ్రో సినిమా తేజ్ జీవితానికి చాలా దగ్గరగా అనిపించింది. అయితే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా బ్రో తో మెగా ఫ్యాన్స్ ని మెప్పించాడు సాయి తేజ్. ఆ సినిమా తర్వాత సంపత్ నందితో సాయి ధరం తేజ్ సినిమా ప్లాన్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో సినిమా అనుకున్నారు. గాంజా శంకర్ టైటిల్ తో ఫస్ట్ గ్లింప్స్ కూడా వదిలారు. ఐతే ఏమైందో ఏమో కానీ సినిమా ఆగిపోయినట్టు టాక్.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమాకు అనుకోని విధంగా బడ్జెట్ సమస్యలు వచ్చాయట. సినిమాను సంపత్ నంది అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేస్తాడని అనుకుంటే సెట్స్ మీదకు వెళ్లకముందే సినిమా బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని నిర్మాతలకు అనిపించిందట. అయితే అంత బడ్జెట్ అయితే కష్టమని షూటింగ్ హోల్డ్ లో ఉంచారని టాక్ . అందుకే సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయినట్టు తెలుస్తుంది. అయితే బడ్జెట్ కంట్రోల్ లోకి తెచ్చి సినిమాను లిమిటెడ్ బడ్జెట్ తో కానిస్తారా లేదా మరో నిర్మాతను వెతుకుతారా అన్నది చూడాలి.
ఏది కుదరకపోతే సినిమా ఆగిపోయినా ఆగిపోవచ్చని కూడా అంటున్నారు. ఏది ఏమైనా మెగా మేనల్లుడు సాయి తేజ్ సినిమాకు ఇలా బడ్జెట్ కష్టాలు రావడం ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఇదివరకు కన్నా నిర్మాతలు కోట్ల కొద్దీ బడ్జెట్ పెట్టేస్తున్నారు కానీ అలా పెట్టాలంటే కంటెంట్ లో దమ్ము ఉండాలి. రెగ్యులర్ మాస్ సినిమా చేస్తూ వందల కోట్ల బడ్జెట్ పెడతానంటే మాత్రం కష్టం అవుతుంది. మరి గాంజా శంకర్ బడ్జెట్ సమస్య తీర్చుతారా లేదా ప్రాజెక్ట్ ని లైట్ తీసుకుంటారా అన్నది త్వరలో తెలుస్తుంది.