'స్పిరిట్' కోసం భార్యాభ‌ర్త‌ల్ని రంగంలోకి దించుతున్నాడా?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` తెరెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-19 07:12 GMT

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సందీప్ రెడ్డి వంగ ద‌ర్శ‌క‌త్వంలో `స్పిరిట్` తెరెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది చివ‌ర్లో షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే సందీప్ వంగ స్క్రిప్ట్ లాక్ చేసారు. ఇందులో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషిస్తున్నాడు? సందీప్ రెడ్డి హీరోలు ఎంత వైలెంట్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. `అర్జున్ రెడ్డి` లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌...`యానిమ‌ల్` లో ర‌ణ‌బీర్ పాత్ర‌ల్ని నెక్స్ట్ లెవ‌ల్లో చూపించాడు.

పూరి త‌ర్వాత హీరో క్యారెక్ట‌రైజేష‌న్ అంత ప‌వ‌ర్ పుల్ గా రాసేది సందీప్ ని ప్రూవ్ అయింది. ఇంకా చెప్పాలంటే పూరి కంటే మ‌రింత ఇన్నోవేటివ్ గా హీరోగా పాత్ర‌ని హైలైట్ చేయ‌డంలో అత‌డు స్పెష‌లిస్ట్ అనొచ్చు. అలాంటి సందీప్ కి ప్ర‌భాస్ లాంటి క‌టౌట్ దొరికితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. `స్పిరిట్` లో ఆ పాత్ర‌ని ఓ రేంజ్ లో ప‌రుగులు పెట్టిస్తాడు.

ఈ సినిమా స్టోరీ ఓడ‌బుల్ డోస్ డ్ర‌గ్ లా ఉంటుంద‌ని.. అన్ని పాత్ర‌లు పోటా పోటీగా సాగుతాయ‌ని ఇప్ప‌టికే రివీల్ చేసాడు. ఈ నేప‌థ్యంలో ఇదే సినిమాలో కీల‌క పాత్ర‌ల‌కు వైఫ్ అండ్ హాస్బెంబ్ క‌రీనా కపూర్ -సైఫ్ అలీఖాన్ ని సంప్ర‌దించే ప‌నిలో ప‌డ్డాడుట సందీప్. స్పిరిట్ లో విల‌న్ పాత్ర బాధ్య‌త‌లు భార్యాభ‌ర్త‌ల‌కు ఇస్తున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. ఇప్ప‌టికే సైఫ్ అలీఖాన్ ఆదిపురుష్ లో విల‌న్ గా న‌టించాడు. కానీ అది పెద్ద స‌క్సెస్ అవ్వ‌లేదు.

అయినా `దేవ‌ర` సినిమాకి కొరాటాల శివ మ‌రోసారి విల‌న్ గా ఛాన్స్ ఇచ్చాడు. తారక్ మాట‌ల్ని బ‌ట్టి సైఫ్ ని బాగానే హైలైట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. సైఫ్ అలీఖాన్ ని ద‌ర్శ‌కులు స‌రిగ్గా వాడుకోలేక‌పోతున్నార‌ని...ఆ వాడ‌కం ఎలా ఉంటుందో? కొర‌టాల శివ `దేవ‌ర` రూపంలో చూపిస్తార‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. ఇంత‌లో సందీప్ వంగ సైతం త‌న సినిమాకి ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు ప్ర‌చారం రావ‌డంతో ఆసక్తి సంత‌రించుకుంది.

Tags:    

Similar News