సైఫ్ అలీఖాన్ కి గాయాలు..అసలు సంగతి ఇది!
సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరడం చికిత్స తీసుకోవడం అంతా నిజమే. దేవర షూటింగ్ కారణంగానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది.
దేవర` షూటింగ్ సమయంలో లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కి గాయాలయ్యాయి అంటూ ఒక్కసారిగా ఓ వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రిలో చేరినట్లు ప్రచారం సాగు తోంది. దీనిపై ఇంతవరకూ చిత్ర బృందానికి సంబంధించిన వారు గానీ..సైఫ్ సన్నిహిత వర్గాలు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఆయనకు నిజంగానే అలా జరిగిందా? ఏంటి ఈ ప్రచారం వెనుక వాస్తవం అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరడం చికిత్స తీసుకోవడం అంతా నిజమే. దేవర షూటింగ్ కారణంగానే ఈ సన్నివేశం చోటు చేసుకుంది. అయితే సైఫ్ అలీఖాన్ గాయాలైంది ఇప్పుడు కాదు. సైఫ్ అలీఖాన్ దేవర షూటింగ్ లో కొన్ని నెలల క్రితమే పాల్గొన్నారు. అప్పుడే యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో సైప్ అలీఖాన్ మోకాలు..భుజానికి గాయాలయ్యాయట. అప్పుడు వాటిని చిన్నగాయలుగా పరిగణించి సైఫ్ అలీఖాన్ వాటిని పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడా గాయాలే తిరగబెట్టడంతో హుటాహుటిన ముంబైలోని కొకిలాబెన్ ఆసుపత్రిలో చేరినట్లు తెలు స్తుంది. ట్రైసప్(కండ) సర్జరీ కచ్చితంగా చేయాలని డాక్టర్లు సూచించడంతో ఇప్పుడు ఆ శస్త్రచికిత్స జరిగి నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై దేవర చిత్రబృందం స్పందించింది. సైఫ్ త్వరగా కోలుకోవాలని తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. అదీ సైఫ్ ఆసుపత్రిలో చేరడం వెనుక అసలు సంగతి. `దేవర` లో సైఫ్ అలీఖాన్ బైర అనే పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆ పాత్రకి సంబంధించిన లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇంతకు ముందు `ఆదిపురుష్` లో లంకేశ్వరుడిగా ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. కాకపోతే ఆ సినిమా ఆశించిన ఫలితాలు సాధిం చలేదు. దీంతో `దేవర`లో భైర పాత్రలో తప్పక మెప్పిస్తాడు? అన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.