చిరు ఆఫర్‌ని తిరస్కరించలేదు.. క్యూలో ఉంచాడు!
ఇదే కోవకు చెందిన దర్శకుడు శైలేష్ కొలను. అతడు తాను రాసుకున్న కథతో అయితేనే స్టార్ హీరోని అయినా డైరెక్ట్ చేస్తాననే స్వీయనిబంధనను కలిగి ఉన్నాడు.
నేటితరం యువదర్శకులు సొంత కథలతో అయితేనే సినిమాలు తీసేందుకు ఆసక్తిగా ఉంటున్నారు. స్వతహాగానే దర్శకులకు ఒక విజన్ ఉంటుంది. తమ మైండ్ లో అనుకున్న లైన్ ని డెవలప్ చేసుకుంటూ వెళ్లే క్రమంలో అద్భుతమైన విజువల్ సెన్స్ తమకు మాత్రమే కలుగుతుంది. అందువల్ల హీరో ఎవరైనా కానీ మేకింగ్ లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా కాకుండా స్టార్ హీరోలు వేరే స్క్రిప్టులు చేతికిచ్చి దర్శకత్వం చేయమని అడిగితే అది కొంత ఇబ్బందికరమైనది.
నేడు టాలీవుడ్ లో ఉన్న చాలామంది డైరెక్టర్లు వేరొకరి కథల్ని అడాప్ట్ చేసుకుని సినిమాలు తీయడం కంటే తామే రాసుకున్న కథల్ని సినిమాలుగా మలిచేందుకే ఆసక్తిగా ఉన్నారు. ఇదే కోవకు చెందిన దర్శకుడు శైలేష్ కొలను. అతడు తాను రాసుకున్న కథతో అయితేనే స్టార్ హీరోని అయినా డైరెక్ట్ చేస్తాననే స్వీయ నిబంధనను కలిగి ఉన్నాడు. అదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి ఆఫర్ వచ్చినా కానీ, అతడు సున్నితంగా కాదనుకున్నాడు. తాను చిరుని ఎలా చూపించాలనుకుంటున్నాడో వారికి నచ్చజెప్పి, అలాంటి కథతో వచ్చి సినిమా చేస్తానని కూడా సవినయంగా తెలియజేసాడట. చిరు ఆఫర్ ని అతడు రిజెక్ట్ చేయలేదు.. ఆఫర్ ని క్యూలో ఉంచాడు.
అప్పటికే చిరు వద్ద ఉన్న కథను అతడు వోన్ చేసుకుని డైరెక్ట్ చేయడం సరికాదనే ఆలోచన కూడా శైలేష్ కి ఉంది. నిజానికి ఈ ఆలోచన ఇతర యువదర్శకులకు కూడా స్ఫూర్తిదాయకమైనదే. దీని వల్ల ఒరిజినల్ కథలు పుడతాయి. ఒరిజినల్ సినిమా బతుకుతుంది. అరువు తెచ్చుకున్న వాటిని తీయడం కూడా తగ్గుతుంది. సురేందర్ రెడ్డి లాంటి సీనియర్ దర్శకుడు మాత్రమే 'తని ఒరువన్'ని 'ధ్రువ' రేంజులో ప్రభావవంతంగా తీయగలరు. హిట్టు కొట్టగలడు. అందరికీ అది సాధ్యం కాదు. చాలా రీమేక్ లు ఫెయిలవ్వడానికి కారణం కూడా ఇదే.