నటుడు కుమార్తె ఆ హీరోకి శిష్యురాలిలా!
బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సయి మంజ్రేకర్ సుపరిచితమే.
బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన సయి మంజ్రేకర్ సుపరిచితమే. తండ్రీ-కుమార్తెలిద్దరు యాక్టింగ్ ప్రోఫెషనల్ దూసుకుపోతున్నారు. డాడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..విలన్ గా బిజీగా ఉంటే? డాటర్ హీరోయిన్ పాత్రలతో బిజీగా ఉంది. త్వరలో ఇద్దరు కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. తండ్రి దర్శకత్వంలో కుమార్తె మెయిన్ లీడ్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతోంది. ఇక ఇద్దరు కలిసి ఒకే ప్రేమ్ లో కనిపిస్తే గనుక అది అదనంగా తన కెరీర్ కి బోనస్ లాంటింది.
ఇలా వృత్తి పరంగా అంత మంచి అనుబంధం ఉంది కుమార్తెకు. మరి అలాంటి సమయంలో కుమార్తెకు గురువు అంటే ఎవర్నీ చెప్పాలి? అంటే తండ్రి పేరే కదా? చెప్పాలి అంటారు. కానీ ఇక్కడ సయి మంజ్రేకర్ తండ్రికి బధులుగా సల్మాన్ ఖాన్ పేరు చెప్పింది. తన గురువు కేవలం సల్మాన్ ఖాన్ ఒక్కడే అంటోంది. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నుంచి ఆయనే నా గురువు అంటూ మీడియా మందుకొచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన `దబాంగ్-3` సినిమాతోనే సయి మంజ్రేకర్ నటిగా పరిచయమైంది.
ఆ తర్వాత `మేజర్` లో నటించి పాన్ ఇండియాలో గుర్తింపు దక్కించుకుంది. `గని`..`స్కంద` లాంటి చిత్రాల్లో కూడా అమ్మడు బ్యూటీతో అవకాశాలు అందుకోగల్గింది. కానీ వాటి ఫలితాల సంగతి తెలిసిందే. అయితే సల్మాన్ ని గురువు అనడానికి కొన్ని ప్రత్యేక కారణాలు చెప్పుకొచ్చింది. అప్పుడే చిత్ర పరిశ్రమకి వచ్చిన తన లాంటి ఎంతో మందికి ఆయన అవకాశాలు కల్పించారని..అలా ఛాన్స్ రాకపోతే మ్యాకప్ వేసుకునే అవకాశం కూడా దొరకదు.
ఆ రకంగా తొలి ఛాన్స్ ఇచ్చిన వారిని గురువుగా భావించానంటోంది. అలా సల్మాన్ తో ఏర్పడిన పరిచయం ఇప్పటికీ ఎంతో పదిలంగా ఉందంది. తాను ఏ సినిమా చేసినా సల్మాన్ ఖాన్ సూచనలు...సలహాలు తప్పక తీసుకుంటుందిట. తను నటించడానికంటే ముందుగా సల్మాన్ వద్దకు వెళ్లి తన పాత్ర గురించి చెబుతుందిట. వృత్తి పరమైన విషయాల్లో తన తండ్రి ఏమాత్రం జోక్యం చేసుకోరని..పూర్తి స్వేచ్ఛ తనకు కల్పించినట్లు తెలిపింది.