పూజ ఛాన్సును కొట్టేసిన ఏజెంట్ పాప!
అఖిల్ ఏజెంట్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సాక్షి వైద్య ను ఈ ఉస్తాద్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ లో పూజా హెగ్డే మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. అయితే, ఇప్పుడు ఆమె టైమ్ అయిపోయింది. చేతికి అందిన ప్రాజెక్టులు కూడా చేజారిపోతున్నాయి. మొన్నటికి మొన్న మహేష్ గుంటూరు కారం నుంచి తప్పుకుంది. ఆ మూవీ లో పూజ రోల్ కాస్త యంగ్ బ్యూటీ శ్రీలల దక్కించుకుంది.
పోనీలే, మహేష్ సినిమా పోయినా, పవన్ సినిమా ఉంది కదా అని అనుకున్నారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజాహెగ్డే పేరే వినపడింది. సెడన్ గా పూజ కాకుండా శ్రీలల ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనడం మొదలుపెట్టింది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉంది కదా, మరో హీరోయిన్ గా పూజ హెగ్డే ఉంటుంది లే అనుకున్నారు. ఇప్పుడు ఆ రోల్ కి మరో యంగ్ హీరోయిన్ ని తీసుకోవడం విశేషం.
గతంలో హరీష్ శంకర్ తో పూజా హెగ్డే దువ్వాడ జగన్నాథం, గద్దలకొండ గణేష్ మూవీల్లో నటించింది. దీంతో, ముచ్చటగా మూడోసారి పూజతో చేసే అవకాశం వస్తుందని అనుకున్నారు. హరీష్ శంకర్ కూడా ఆమెనే తీసుకోవాలని చాలా స్ట్రాంగ్ గా ఫీలయ్యారట. కానీ మరో బ్యూటీని ఎంపిక చేశారు.
అఖిల్ ఏజెంట్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సాక్షి వైద్య ను ఈ ఉస్తాద్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో, పూజ ఈ సినిమాలో లేదు అనే విషయం లో కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఈ సాక్షి వైద్య ఏజెంట్ కాకుండా, వరుణ్ తేజ్ గాంఢీవదారి అర్జున లో నటించింది. ఈ మూవీ విడుదలకు సిద్ధమౌతోంది.
నిన్న, మొన్నటి వరకు ఏ మూవీలో హీరోయిన్ తప్పుకున్నా, ఆ స్థానంలో శ్రీలీల మంచి ఆప్షన్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు 10కి పైగా సినిమాలు ఉన్నాయి. కాగా, ఇప్పుడు డైరెక్టర్ లకు శ్రీలలతో పాటు సాక్షి వైద్య రూపంలో మరో మంచి ఆప్షన్ దొరికిందనే చెప్పాలి. ఈ అమ్మాయి చూడటానికి అందంగా ఉండటంతో పాటు, నటన పరంగానూ ఆకట్టుకుంటోంది. ఇక, ఈ ఉస్తాద్ లో ఒరిజనల్ మూవీలో సమంత చేసిన రోల్ శ్రీలల, అమీ జాక్సన్ రోల్ లో సాక్షి వైద్య కనిపించనున్నారని తెలుస్తోంది.