సలార్ డీల్స్ గొడవ.. నిజమా అబద్దామా?
సినిమా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ డీల్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. అలాగే కన్నడ డీల్ కూడా క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది.
ప్రభాస్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా మూవీ సలార్ విడుదలకు ఇంకా కొన్ని వారాల సమయం మాత్రమే ఉంది. తప్పకుండా ఈ సినిమాతో ప్రభాస్ సక్సెస్ అందుకొని ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తాడు అని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ చివరిలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన సినిమాను డిసెంబర్ 22 కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఇక మొత్తానికి సినిమా అవుట్ ఫుట్ పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా దర్శకుడు సలార్ ను సిద్ధం చేస్తున్నాడు. విడుదల డేట్ విషయంలో అయితే ఏ మాత్రం మార్పు ఉండదు అనే విధంగా నిర్మాతల నుంచి ఒకటి క్లారిటీ అయితే వస్తుంది. ఇక ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే ఆ విషయంలో మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్ రీసెంట్గా విదేశాల గురించి హైదరాబాద్కు తిరిగి వచ్చేసాడు.
ఇక అతను ప్రమోషన్స్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది. అయితే విడుదలకు అప్డేట్స్ తో హడావిడి మొదలు పెట్టాల్సిన సమయంలో ఇప్పుడు సినిమాపై ఉహించని గాసిప్స్ కొన్ని వైరల్ అవుతున్నాయి. సినిమా రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ డీల్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. అలాగే కన్నడ డీల్ కూడా క్లోజ్ అయినట్టుగా తెలుస్తుంది.
ఇక ఓటీటీ శాటిలైట్ హక్కులను కూడా మంచిదరకు అమ్ముడుపోయాయని టాక్. అయితే హిందీలో ఒక బడా నిర్మాణ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. కానీ ఇప్పుడు మళ్లీ ఎందుకో ఆ సంస్థ వెనుకడుగు వేసిందని డీల్ క్యాన్సిల్ అయినట్లు చాలా రకాలుగా గాసిప్స్ అయితే వైరల్ అవుతున్నాయి
ఇక ఈ విషయం కొందరు నిజమని అనుకుంటుంటే మరికొందరు సలార్ విషయంలో కాదు మరొక పెద్ద సినిమాకు ఇలాంటి ఇబ్బంది వచ్చిందని క్లారిటీ ఇస్తున్నారు. ఒకవేళ బిజినెస్ డీల్ క్యాన్సిల్ అయిన కూడా సలార్ కు పెద్దగా నష్టం వచ్చేది ఏమీ లేదు. మంచి డిమాండ్ ఉంది కాబట్టి మరొకరికి మంచి రేటుకి అమ్ముకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి నిర్మాతలకు ఆ విషయంలో మాత్రం పెద్దగా టెన్షన్ ఉండకపోవచ్చు. కానీ రిలీజ్ టైం లో ఈ తరహా ఈ గందరగోళం రాకుండా చూసుకుంటే బెటర్.