డైనోసర్ పోస్ట్ పోన్.. వీళ్లకు మంచి ఛాన్స్..!
ప్రభాస్ సలార్ టీజర్ లో అడవిలో లయన్, చీత, టైగర్, ఎలిఫెంట్ చాలా డేంజరస్ కానీ జురాసిక్ పార్క్ లో కాదు
ప్రభాస్ సలార్ టీజర్ లో అడవిలో లయన్, చీత, టైగర్, ఎలిఫెంట్ చాలా డేంజరస్ కానీ జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే అక్కడ డైనోసర్ ఉంటుందని ప్రభాస్ కు భారీ ఎలివేషన్ ఇచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ డైలాగ్ ని నిజం చేస్తూ డైనోసర్ అదే ప్రభాస్ సినిమా రేసు నుంచి తప్పుకోవడంతో ఆ డేట్ న వస్తున్నాయి కొన్ని సినిమాలు. సినిమాల రిలీజ్ విషయంలో సినిమాల మధ్య పోటీ అందరికీ తెలిసిందే. అయితే ఈ పోటీలో పెద్ద హీరో సినిమా వాయిదా అని తెలిస్తే చాలు మిగతా సినిమాలన్నీ ఎటాక్ చేస్తాయి.
ప్రస్తుతం అదే సీన్ ఇక్కడ రిపీట్ అవుతుంది. సెప్టెంబర్ 28న ప్రభాస్ సలార్ పార్ట్ 1 రిలీజ్ ఫిక్స్ చేశారు. కానీ ఆ సినిమా అనుకున్న టైం కు రావడం కష్టమని తెలుస్తుంది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తి కాక సినిమా వాయిదా వేస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. సెప్టెంబర్ 28న సలార్ రావట్లేదని తెలియగానే రామ్ స్కంద, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్, శ్రీకాంత్ అడ్డాల పెదకాపు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి.
స్కంద, రూల్స్ రంజన్ అదే డేట్ న వస్తుండగా పెదకాపు మాత్రం ఒకరోజు ఆలస్యంగా సెప్టెంబర్ 29న వస్తున్నాడు. ఇక వీటితో పాటుగా లారెన్స్ చంద్రముఖి 2 కూడా సెప్టెంబర్ 28న రిలీజ్ లాక్ చేసుకుంది. అసలైతే సెప్టెంబర్ 15న రిలీజ్ అవ్వాల్సిన రామ్ స్కంద, చంద్రముఖి 2 సినిమాలు ప్రభాస్ సినిమా వాయిదా అని తెలియగానే ఆ డేట్ కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ అడవిలో ఎన్ని జంతువులు ఉన్నా డైనోసర్ లెక్క వేరంటూ సలార్ టీజర్ లోని డైలాగ్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
సలార్ పార్ట్ 1 సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడింది. మరి నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. సలార్ 1 టీజర్ చూశాక రెబల్ ఫ్యాన్స్ అంతా కూడా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరి సలార్ 1 రిలీజ్ పై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రభాస్ సలార్ వాయిదా పడటం ఆ డేట్ న వస్తున్న ఈ నాలుగు సినిమాలకు కలిసి వచ్చేలా ఉంది. మరి రెండు రోజుల్లో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న సెప్టెంబర్ మంత్ ఎండ్ ప్రేక్షకులను ఏ సినిమా ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుంది అన్నది చూడాలి.