సలార్ VS డంకీ : రిలీజ్ కి ముందే అస్త్ర సన్యాసం!
కానీ విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది డంకీ పై సలార్ స్పష్టమైన ఆధిపత్యం కనబర్చుతున్నాడు అంటూ సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటూ ఉన్నారు.
2023 చివరికి చేరుకున్నాం. ఈ ఏడాదిలో గడచిన 11 నెలల్లో వచ్చిన సినిమాలు ఒక ఎత్తు అయితే మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండు సినిమాలు ఒక ఎత్తు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మరియు సినీ ప్రేమికులు సలార్ మరియు డంకీ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఒక్క రోజు తేడా తో రాబోతున్న ఈ రెండు సినిమాలు మొన్నటి వరకు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడటం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది డంకీ పై సలార్ స్పష్టమైన ఆధిపత్యం కనబర్చుతున్నాడు అంటూ సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటూ ఉన్నారు.
ట్రైలర్ మరియు అడ్వాన్స్ బుకింగ్ విషయం లో సలార్ జోరు చూస్తే మామూలుగా లేదు. సలార్ రికార్డుల ముందు డంకీ ఎక్కడ కూడా కనిపించడం లేదు. సలార్ ట్రైలర్ వ్యూస్ లో డంకీ ట్రైలర్ వ్యూస్ కనీసం సగం కూడా లేవని చెప్పాలి. ఇక అడ్వాన్స్ బుకింగ్ లో బాద్ షా ఏమాత్రం ప్రభావం చూపించలేక పోతున్నాడు.
అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు ఇంకా పలు ఓవర్సీస్ ఏరియాల్లో సలార్ కి రికార్డ్ స్థాయిలో షో లు పడబోతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ తో అమెరికాలో మిలియన్ డాలర్ల మార్క్ ను క్రాస్ చేసిన సలార్ ఇతర ప్రాంతాల్లో కూడా భారీ అడ్వాన్స్ బుకింగ్ ని నమోదు చేసుకున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
బాద్ షా డంకీ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అవమానకరంగా ఉన్నాయట. అందుకే మేకర్స్ ఆ లెక్కలను చెప్పడం లేదని బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డంకీ నుంచి మరో ట్రైలర్ ను వదిలేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ట్రైలర్ వస్తే ఏమైనా మారే అవకాశం ఉందేమో చూడాలి.
షారుఖ్ ఖాన్ గత చిత్రాలు పఠాన్ మరియు జవాన్ లు వెయ్యి కోట్లు సాధించినా కూడా ప్రభాస్ తో యుద్దం నేపథ్యంలో షారుఖ్ ముందుగానే పట్టు విడిచినట్లుగా కనిపిస్తోంది. యుద్దంకు ముందే షారుఖ్ అస్త్ర సన్యాసం చేశాడు అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ లో సలార్ స్పష్టమైన ఆధిపత్యం కనబర్చుతూ ఉంటే, రిలీజ్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగాలని ప్రభాస్ అభిమానులు కోరుకుంటూ ఉన్నారు.